ETV Bharat / international

ఉక్రెయిన్​లోని ఆ ప్రాంతాల్లో రష్యా మార్షల్ లా.. వారికి మరిన్ని అధికారాలు - రష్యా ఉక్రెయిన్​ లేటెస్ట్ న్యూస్

Russia Martial Law : రష్యాలో విలీనం చేసుకున్న నాలుగు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో మార్షల్‌ లా విధిస్తున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, భద్రతా బలగాలకు అదనపు అధికారాలు దక్కనున్నాయి. విలీన ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ పుతిన్‌ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

Russia Martial Law
Russia Martial Law
author img

By

Published : Oct 19, 2022, 7:25 PM IST

Russia Martial Law : ఉక్రెయిన్‌లో ఆక్రమించుకుని తమ దేశంలో విలీనం చేసుకున్న దొనెత్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాల్లో రష్యా మార్షల్‌ లా విధించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగ అధినేతలకు అదనపు అత్యవసర అధికారాలు దక్కనున్నాయి. ఐతే మార్షల్‌ లా ద్వారా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని పుతిన్‌ వెల్లడించలేదు.

ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న తర్వాత ఇటీవలే ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన రష్యా.. ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినట్లు తెలిపింది. వీటిని తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా-ఉక్రెయిన్‌ బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రష్యా భద్రత, సురక్షితమైన భవిష్యత్తు, తమ ప్రజల రక్షణకు చాలా కష్టమైన పనులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పుతిన్‌ వెల్లడించారు. ముందుండి పోరాడుతున్న సైనికుల వెంట దేశం మొత్తం ఐక్యంగా నిలిచి ఉందన్నారు.

సైనిక శాసనం విధించడం వల్ల ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు సహా ప్రజలు సమూహాలుగా గుమిగూడటంపై ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సెన్సార్‌షిప్‌ అమల్లోకి వస్తుంది. భద్రతా బలగాలు, అధికారులకు మరిన్ని అధికారాలు దక్కుతాయి. ఐతే ఏ ఏ అధికారాలు దక్కనున్నాయి అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్ విషయంలో రష్యా ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయానికి ఒక కోఆర్డినేషన్‌ కమిటీని కూడా పుతిన్‌ ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: చీప్ వెపన్స్​తో రష్యా దాడులు.. ఇరాన్ మోపెడ్​లతో కీవ్​లో విధ్వంసం

విద్యుత్‌ కేంద్రాలే రష్యా టార్గెట్‌.. లక్షల మంది ఉక్రెయిన్‌ ప్రజలు అంధకారంలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.