బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్ చిక్కుల్లో పడ్డారు. అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఆయన స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ ఒక మిలియన్ పౌండ్లు విరాళంగా తీసుకున్నట్లు ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ ఆరోపణలపై లండన్ పోలీసులు విచారణ చేపట్టారు. 2013లో లాడెన్ కుటుంబానికి చెందిన బకర్‌తో సమావేశమైన ప్రిన్స్ చార్లెస్.. ఈ విరాళాన్ని అంగీకరించినట్లు ప్రచురించిది. చార్లెస్ సన్నిహితులు కొందరు విరాళాన్ని వెనక్కి ఇచ్చేయాలని సూచించారని సండే టైమ్స్ పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన చార్లెస్ కార్యాలయం.. ప్రిన్స్ వ్యక్తిగతంగా విరాళాన్ని స్వీకరించారన్న విషయాన్ని ఖండించింది. పూర్తి శ్రద్ధ వహించి ఈ విరాళాన్ని స్వీకరించామని ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్ స్పష్టం చేసింది. ట్రస్టు ధర్మకర్తలు అందరూ కలిసే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపింది.
ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్‌ను 1979లో స్థాపించారు. వివిధ రూపాల్లో వచ్చిన విరాళాలను బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్, ఇతర దేశాల్లో అభివృద్ధికి వినియోగిస్తారు. 2001లో అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను.. 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చాయి. పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్ కంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను యూఎస్ నేవీ సీల్ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టింది.
ఇవీ చదవండి: భగభగ మండుతూ.. భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్ శకలాలు
లంకేయుల బాటలోనే.. మరో దేశ పార్లమెంట్ ముట్టడి.. పూల్‌లో డ్యాన్సులతో రచ్చ రచ్చ!