ETV Bharat / international

'మా సొమ్మును చైనాకు దోచిపెడుతున్నారు'- పాకిస్థాన్​పై POK ప్రజలు ఫైర్ - పీఓకేలో ఆందోళనలు

POK Protest Against Pakistan : పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పీఓకేలోని సహజ వనరులను దోపిడీ చేసి.. ఆ మొత్తాన్ని ఇతర ప్రాంతాల వారికి పంచిపెడుతోంది. ఉద్యోగాలు, వేతనాల అంశాల్లో తమకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహంగా ఉన్న పీఓకే ప్రజలు.. తమ వనరులను దోచుకుంటున్న పాక్‌ పాలకులపై ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. తమ నుంచి పన్నులను ముక్కుపిండి వసూలు చేసి చైనా కంపెనీలకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

POK Protest Against Pakistan
POK Protest Against Pakistan
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 9:45 PM IST

POK Protest Against Pakistan : పాకిస్థాన్​ పాలకులపై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజల ఆగ్రహం.. కట్టలుతెంచుకుంటోంది. నిత్యావసరాల ధరల భారం, ఉద్యోగాల్లో నియామకాలు, వేతనాల వంటి అంశాల్లో పాక్‌ పాలకులపై స్థానికులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. విద్యుత్‌ విషయంలోనూ తమకు తీవ్ర అన్యాయంపై జరుగుతుండటం వల్ల ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు.

పాకిస్థాన్‌లో "మెజారిటీ విద్యుత్‌ ఉత్పత్తి" పీఓకే ప్రాంతంలో జరుగుతోంది. అయినా వీరి నుంచే పాక్‌ ప్రభుత్వం అధికంగా విద్యుత్‌ ఛార్జీలను వసూలు చేస్తోంది. సరఫరా చేస్తున్న విద్యుత్‌లో నాణ్యత ఉండటం లేదు. తరచూ విద్యుత్‌ కోతలు విధిస్తుండటం వల్ల స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ ప్రాంతంలో తయారైన విద్యుత్‌పై కొంతశాతం ఓనర్‌ షిప్‌ కావాలని పీఓకే ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

"ఎక్కువ విద్యుత్ పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉత్పత్తవుతోంది. కానీ ఇక్కడి ప్రజలకే విద్యుత్‌ సరఫరా లేక లోడ్‌ షడ్డింగ్‌ సమస్యను అనుభవిస్తున్నారు. అంతేకాక ఇక్కడి ప్రజలపై భారీగా విద్యుత్‌ ఛార్జీలు విధిస్తున్నారు. ఇక్కడ 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పీవోకేలో 24 గంటల విద్యుత్‌ సరఫరాకు 400 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. మంగ్లా డ్యామ్‌ను నిర్మించినప్పుడు ఇస్లామాబాద్‌ పాలకులు.. పీఓకే ప్రభుత్వంతో ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఒప్పందం చేసుకున్నారు. నీలమ్‌-జీలం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం క్రమంలో అలాంటి ఒప్పందాలేం చేసుకోలేదు. పీఓకే ప్రజల డబ్బుతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించారు. పీఓకేలో చాలా నదులు ఉన్నాయి. అక్కడ విద్యుత్‌ ఉత్పత్తి కోసం పలు ప్రాజెక్టులను పాక్‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకోసం స్థానికులే ఎక్కువ పన్ను చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. దీంతో స్థానికులు విద్యుత్‌ ఛార్జీల చెల్లింపులను బహిష్కరించారు."
--సయ్యద్‌ వాకర్, ఆందోళనకారుడు

పీఓకేలో సహజ వనరుల దోపిడీ, ప్రభుత్వ పాలసీల్లో అక్రమాలు ఇలాగే కొనసాగితే త్వరలో ఈ ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని పీఓకే ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులకు నిరసనగా గత నెలలో పీఓకే అంతటా షట్టర్ డౌన్, వీల్ జామ్ సమ్మెల పేరుతో చాలా వ్యాపారాలకు బంద్‌ ప్రకటించారు.

"రెంటల్‌ పవర్‌ ప్రాజెక్టుతోపాటు చాలా ప్రాజెక్టుల కార్యకాలాపాలు సాగడం లేదు. వారు విద్యుత్‌ ఉత్పత్తి చేయడం లేదు. అయితే ఒప్పందం ప్రకారం కొన్ని సంస్థలకు పాక్‌ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. మా నుంచి వసూలు చేసిన పన్నులను వాటికి కేటాయిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. మిర్పుల్‌, కోట్లి, పనౌజ్‌, ముజఫరాబాద్‌లోని 80 శాతం మంది కరెంటు బిల్లులను నాలుగు నెలలుగా చెల్లించడం లేదు."
--సయ్యద్‌ వాకర్, ఆందోళనకారుడు

POK Protest Against Pakistan : 'POKను పాకిస్థాన్​ ఖాళీ చేయాల్సిందే'.. ఐరాస వద్ద కశ్మీర్‌ ప్రజల నిరసన!

POK People Problems : దయనీయంగా POK ప్రజల జీవితాలు.. తిండి కోసం పాట్లు.. పట్టించుకోని పాక్​ సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.