Poison Attack On Dawood Ibrahim : పరారీలో ఉన్న ముంబయి పేలుళ్ల సూత్రధారి, అండర్‌వరల్డ్ డాన్, దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అతడిపై విషప్రయోగం జరిగినట్లు సమాచారం. దావూద్‌కు భారీ భద్రత మధ్య ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మీడియాలో కథనాలు (Dawood Ibrahim Latest News) వస్తున్నాయి. అయితే దావూద్ రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆ ఆస్పత్రి ఫ్లోర్లో అందరిని ఖాళీ చేయించి దావూద్‌కు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసులు దావూద్ బంధువుల దగ్గరి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Internet Down In Pakistan Now : మరోవైపు, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు సమాచారం. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు కూడా డౌన్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు పాక్‌లోని మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి.
దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకుని కరాచీలో నివసిస్తున్నట్లు అతడి బంధువులు తెలిపినట్లు ఈ ఏడాది జనవరిలో వార్తలు వచ్చాయి. అతడి మేనల్లుడు అలిషా పార్కర్ దావూద్ కుటుంబం గురించి పూర్తి వివరాలు వెల్లడించినట్లు సమాచారం. కరాచీలోనే వేరే ప్రదేశానికి మారినట్లు తెలుస్తోంది.
1993 Mumbai Blast : 1993లో జరిగిన ముంబయి దాడులకు దావూద్ ఇబ్రహీం సూత్రధారి. ఈ దాడుల్లో 250 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. దీంతో దావూద్ భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో చేరాడు. ఇతడి గురించి జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇతడు పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్నాడని భారత్ పలుమార్లు చెప్పినా వాటిని పాకిస్థాన్ వ్యతిరేకించింది. అయితే ఇప్పటికే దావుద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్ పేరు కరాచీ అడ్రస్‌తో ఉంది.
అండర్‌వరల్డ్ డాన్ 'దావూద్' గ్యాంగ్‌లో ఇద్దరు అరెస్ట్.. చోటా షకీల్‌తో!