ETV Bharat / international

భారత్​లో జెట్ ఇంజిన్ల తయారీ.. అమెరికాతో ఒప్పందం ఖరారు.. మనకు మాత్రమే స్పెషల్!

author img

By

Published : Jun 22, 2023, 5:16 PM IST

Updated : Jun 22, 2023, 6:06 PM IST

PM Modi US Visit : భారత్‌లోనే యుద్ధ విమానాల ఇంజిన్లను ఉత్పత్తి చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఏరోస్పేస్‌లో దిగ్గజ కంపెనీ జనరల్‌ ఎలక్ట్రిక్‌.. దేశీయ కంపెనీ హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌తో కలిసి ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. జీఈ రూపొందించిన F414-INS6 ఇంజిన్లను భారత్‌లోనే ఉత్పత్తి చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పించనుంది. అదే విధంగా భారత్​లో 24వేల 540 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టేందుకు.. అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్​ చిప్​ తయారీ సంస్థ ముందుకొచ్చింది. గుజరాత్​లో సెమీకండక్టర్ టెస్ట్, తయారీ ప్లాంట్​ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

PM Modi US Visit
హెచ్​ఏఎల్​తో జీఈ ఏరోస్పేస్ ఒప్పందం

Tejas Fighter Jet Engine : భారత్‌, అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ మైత్రి మరింత బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీ జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) హిందుస్థాన్‌ ఏరోనాటికల్ లిమిటెడ్‌తో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ దేశీయంగా రూపొందించిన తేజస్‌ మార్క్‌-2 యుద్ధ విమానాల కోసం ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌తో కలిసి జీఈ సంస్థ సంయుక్తంగా ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు జనరల్‌ ఎలక్ట్రిక్ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

GE Aerospace HAL Agreement : ఈ ఒప్పందంతో భారత్‌, అమెరికా మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం అవుతుందని జీఈ పేర్కొంది. భారత్‌, హిందుస్థాన్‌ ఏరోనాటికల్ ప్రైవేట లిమిటెడ్‌తో ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్లే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందని జనరల్‌ ఎలక్ట్రిక్ ఛైర్మన్‌ లారెన్స్ కల్ప్ పేర్కొన్నారు. జీఈ రూపొందించిన ఎఫ్‌414-ఐఎన్ఎస్‌ 6 ఇంజిన్లను తేజస్‌ మార్క్‌-2 యుద్ధ విమానాల్లో వినియోగించనున్నారు. ఇంజిన్‌ తయారీ ఒప్పందం కింద కీలక పరిజ్ఞానాలు మన దేశానికి బదిలీ అవుతాయి.

గగనతల పోరాటంలో ఫైటర్‌ జెట్ యుద్ధవిమానాలే కీలకంగా నిలవనున్నాయి. ధ్వనిని మించిన వేగంతో దూసుకెళ్తూ అద్భుత విన్యాసాలు చేయగలిగే ఈ లోహవిహంగాలకు జెట్‌ ఇంజినే గుండెకాయ! వీటి అభివృద్ధి, ఉత్పత్తి పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో మకుటాయమానంగా భావిస్తారు. వీటి సామర్థ్యం యుద్ధ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జెట్‌ ఇంజిన్‌ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, రష్యాల వద్ద మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించడం లేదు. అణు రియాక్టర్ల పరిజ్ఞానం కన్నా జెట్‌ ఇంజిన్‌ సాంకేతికతను ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నాయి. చైనా భారీ బడ్జెట్‌తో రూపొందించిన డబ్ల్యూఎస్‌-10 జెట్‌ ఇంజిన్‌ సరిపడా శక్తిని ఉత్పత్తి చేయడంలో చతికలపడింది.

ఎఫ్‌414ఇంజిన్‌ ప్రత్యేకతలు..
1970లలో అభివృద్ధి చేసిన ఎఫ్‌404 ఇంజిన్‌కు కొత్త వెర్షనే ఎఫ్‌414ఇంజిన్‌. దీని ప్రత్యేకతల దృష్ట్యా ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌, ఈఏ-18జీ గ్రౌలర్‌ సహా అనేక యుద్ధవిమానాలకు ఈ ఇంజిన్‌ వినియోగిస్తున్నారు. ఎఫ్‌404 ఇంజిన్‌ 90 కిలోన్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే జీఈ-ఎఫ్‌414 ఇంజిన్‌ దాదాపు 98 కిలోన్యూటన్ల శక్తిని వెలువరిస్తుంది. వీటి నిర్వహణ కూడా చాలా సులువు. దాంతో ఖర్చులు తగ్గుతాయి. ఫుల్‌ అథారిటీ డిజిటల్‌ ఇంజిన్‌ కంట్రోల్‌ వ్యవస్థ కలిగిన మొదటి ఫైటర్‌ ఇంజిన్‌ కూడా ఇదే. దీనివల్ల ఇంజిన్‌ పనితీరును అత్యంత కచ్చితత్వంతో నియంత్రించడంతో పాటు ఇంధన సమర్థత పెరుగుతుంది. ఒక్కో ఇంజిన్‌ ఖరీదు 30 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం 80 శాతం మేర జెట్‌ ఇంజిన్‌ పరిజ్ఞానాన్ని భారత్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నుంచి ఈ స్థాయిలో ఏ దేశమూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్​లో 24వేల 540 కోట్ల రూపాయలతో అమెరికా కంపెనీ పెట్టుబడి..
Micron Investment In India : మోదీ అగ్రరాజ్య పర్యటన వేళ.. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అమెరికా సంస్థ ముందుకొచ్చింది. ప్రముఖ 'కంప్యూటర్​ స్టోరేజ్​ చిప్​' తయారీ సంస్థ అయిన మైక్రాన్.. 2.75 బిలియన్ డాలర్ల(దాదాపు 24వేల 540 కోట్ల రూపాయలు) భారత్​లో పెట్టుబడులు పెట్టనుంది. గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ టెస్ట్, తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్లాంట్​తో రాబోయే సంవత్సరాలలో దాదాపుగా 5వేల మందికి ప్రత్యక్షంగా, మరో 15వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.

"ఈ ప్లాంట్​ 'మోడిఫైడ్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్​ ప్యాకేజింగ్ (ATMP) పథకం' క్రింద భారత ప్రభుత్వంచే ఆమోదం పొందింది. దీంతో మొత్తం ప్రాజెక్ట్​పైన మైక్రాన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 20 శాతం ఆర్థిక సాయం అందుతుంది." అని మైక్రాన్​ సంస్థ వెల్లడించింది. 2023లోనే ఈ ప్రాజెక్ట్​ మొదటి దశ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. 2024 చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపింది.

Last Updated : Jun 22, 2023, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.