ETV Bharat / international

ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనియన్లకు ఘర్షణ.. 152 మందికి గాయాలు

Palestinians clash: జెరూసలెంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య మరోమారు ఘర్షణ తలెత్తింది. ప్రముఖ ప్రార్థన మందిరంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తగా 152 మంది పాలస్తీనియన్లు, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. మసీదులోకి ఇజ్రాయెల్‌ పోలీసులు ప్రవేశించటమే ఉద్రిక్తతలకు కారణంగా తెలుస్తోంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రకటించారు.

palestinians-clash-with-israeli-police-at-jerusalem-holy-site
ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనియన్లకు ఘర్షణ
author img

By

Published : Apr 15, 2022, 4:10 PM IST

Israeli police Palestinians clash: జెరూసలేంలోని ప్రముఖ ప్రార్థన మందిరం అల్-అక్సా మసీదు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పవిత్ర రంజాన్‌ మాసం కావడం వల్ల పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థన చేసేందుకు అల్‌ అక్సా మసీదుకు వచ్చారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ బలగాలు మసీదులోకి ప్రవేశించేందుకు యత్నించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తాయి.

Israeli police clash: బలగాలను అడ్డుకునేందుకు వేలాది మంది పాలస్తీనియన్లు మసీదుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బలగాలపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను పోలీసులు నిలువరించే క్రమంలో పలువురు గాయపడ్డారు. దాడికి సేకరించిన రాళ్లను స్వాధీనం చేసుకునేందుకే తమ బలగాలు మసీదు లోపలికి ప్రవేశించాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. హింసను ముందే ఊహించి వారు వాటిని సేకరించినట్లు ఆరోపించింది. పరిస్థితిని శాంత పరిచేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ పేర్కొన్నారు.

Jerusalem clash: జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. ఇది యూదులకూ పవిత్ర స్థలంగానే ఉంది.యూదులు దీనిని టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్, పాలస్తీనా వాసులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన అల్‌-అక్సా మసీదు ప్రపంచలోని ప్రముఖ ఇస్లాం ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా ఉంది. ఈ మసీదు.. ఇస్లాంలో మూడవ పవిత్ర ప్రదేశం.

ఇదీ చదవండి: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్​ ధర ఒకేసారి రూ.84 పెంపు.. ఎక్కడంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.