Pakistan Bus Accident: పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
అతివేగం, భారీ వర్షం ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 'క్వెట్టా సమీపానికి చేరుకోగానే డ్రైవర్.. బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఓ మలుపు వద్ద ఉన్న సమయంలో బస్సు లోయలో పడిపోయింది. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీశాం. గాయపడ్డ 11 మందిని ఆస్పత్రిలో చేర్చాం' అని అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ మెహ్తాబ్ షా వెల్లడించారు.
'మృతులు పెరిగే ఛాన్స్!'
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నూర్ హక్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పాక్ ప్రధాని విచారం
ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బలూచిస్థాన్ సీఎం మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: