పాకిస్థాన్‌లో వికీపీడియాను ఆ దేశ టెలికాం అథారిటీ నిషేధించింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించకపోవడం వల్ల వికీపీడియాపై వేటు పడినట్లు పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) అధికార ప్రతినిధి మలహత్ ఒబాద్.. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. నిబంధనలను పాటించకపోవడం వల్లే వికీపీడియాపై నిషేధం విధించినట్లు చెప్పారు. హైకోర్టు సూచన మేరకు వికీపీడియాకు యాక్సెస్ లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితమే వికీపీడియాను 48 గంటలపాటు యాక్సెస్ లేకుండా చేసి పాకిస్థాన్ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.
అంతకుముందు.. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని వికీపీడియాకు నోటీసు జారీ చేసినట్లు పీటీఏ అధికార ప్రతినిధి మలహత్ తెలిపారు. అయితే వికీపీడియా కంటెంట్‌ను తొలగించగా పోగా.. వివరణ కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగిస్తే నిషేధం తొలగించే అంశంపై పునరాలోచిస్తామని తెలిపారు.
'పాకిస్తాన్ ప్రభుత్వం వికీపీడియాను పునరుద్ధరిస్తుందని మేం ఆశిస్తున్నాం. ప్రజలు నాలెడ్జ్‌ను అందుకోవడం, ప్రపంచంతో పంచుకోవడానికి వికీపీడియా ఉపయోగపడుతుంది.' అని వికీపీడియా అధికారి ఒకరు తెలిపారు. దైవదూషణకు పాల్పడినందుకు సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, యూట్యూబ్ వంటివి పాకిస్థాన్‌లో పలుమార్లు నిషేధం ఎదుర్కొన్నాయి.