ETV Bharat / international

అఫ్గాన్​పై పాక్​ వాయుదాడులు.. 40 మంది మృతి - తాలిబన్ల వార్తలు తాజా

Pakistan Air Strike: అఫ్గానిస్థాన్​పై పాకిస్థాన్​ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 40 మందికిపైగా మృతిచెందారు. పాక్​ వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.

d
d
author img

By

Published : Apr 17, 2022, 11:27 AM IST

Pakistan Air Strike on Afghanistan: అఫ్గానిస్థాన్​లోని ఖోస్ట్​, కునార్​ ప్రావిన్సుల్లోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్​ వైమానిక దాడులు జరిపింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. అఫ్గాన్​లో తాలిబన్లు అధికారం చేపట్టాక పాకిస్థాన్​ దాడులు చేపట్టడం ఇదే తొలిసారి' అని తెలిపింది.

ఆ ప్రాంతంలో దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు కూడా నిర్ధరించారు. దాడులకు బలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడులను ఖండిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. "ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా పాక్​ రాయబారి మన్సూర్​ అహ్మద్​ ఖాన్​కు సమన్లు జారీ చేశాం" అని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి : ఉక్రెయిన్​కు అమెరికా ఆయుధాలు.. రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.