Operation Ajay Israel India : ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ప్రారంభించిన 'ఆపరేషన్ అజయ్'లో భాగంగా తొలి విమానం.. భారత్‌కు శుక్రవారం రానుంది. చార్టర్డ్ ఫ్లైట్‌లో దాదాపు 230 మంది భారతీయులను.. ఇజ్రాయెల్ నుంచి తొలి బ్యాచ్‌గా తీసుకురానున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం.. టెల్ అవీవ్‌కు చార్టర్డ్ విమానం చేరుకుంటుందని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 230 మంది భారతీయులు.. మొదటి బ్యాచ్‌గా భారత్‌కు శుక్రవారం రానున్నట్లు చెప్పారు.
'పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలి'
Operation Ajay By India : ఈ సందర్భంగా ఇజ్రాయెల్- హమాస్ ఉద్రిక్తతపై విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపారు. "ఇజ్రాయెల్ - పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది" అని బాగ్చీ తెలిపారు.
-
#WATCH | "We remain committed to ensuring parity in our diplomatic presence," says MEA spokesperson Arindam Bagchi on India-Canada diplomatic issue. pic.twitter.com/VfKqEPX0xK
— ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "We remain committed to ensuring parity in our diplomatic presence," says MEA spokesperson Arindam Bagchi on India-Canada diplomatic issue. pic.twitter.com/VfKqEPX0xK
— ANI (@ANI) October 12, 2023#WATCH | "We remain committed to ensuring parity in our diplomatic presence," says MEA spokesperson Arindam Bagchi on India-Canada diplomatic issue. pic.twitter.com/VfKqEPX0xK
— ANI (@ANI) October 12, 2023
'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదు'
India On Israel Palestine Conflict : ఇజ్రాయెల్, గాజాలో మానవతా పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ జరిపిన దాడులను ఉగ్రవాద దాడులుగా పరిగణిస్తోందని తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధపరంగా సాయం అందిస్తోందా అన్న ప్రశ్నకు.. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు.
-
VIDEO | "My understanding is about a dozen odd people are there in West Bank while 3-4 people are in Gaza. The number is very small. Mostly, we have received requests (to rescue) from Israel," says @MEAIndia spokesperson amid #IsraelPalestineConflict. pic.twitter.com/XyvcFdkK4I
— Press Trust of India (@PTI_News) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "My understanding is about a dozen odd people are there in West Bank while 3-4 people are in Gaza. The number is very small. Mostly, we have received requests (to rescue) from Israel," says @MEAIndia spokesperson amid #IsraelPalestineConflict. pic.twitter.com/XyvcFdkK4I
— Press Trust of India (@PTI_News) October 12, 2023VIDEO | "My understanding is about a dozen odd people are there in West Bank while 3-4 people are in Gaza. The number is very small. Mostly, we have received requests (to rescue) from Israel," says @MEAIndia spokesperson amid #IsraelPalestineConflict. pic.twitter.com/XyvcFdkK4I
— Press Trust of India (@PTI_News) October 12, 2023
'ఆపరేషన్ అజయ్‌కు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు'
Operation Ajay News : భారత ప్రభుత్వం ఆరంభించిన 'ఆపరేషన్ అజయ్'ను స్వాగతిస్తున్నట్లు ఆ దేశ కౌన్సిల్ జనర్ కొబ్బి శోషని తెలిపారు. తమ దేశంలో 1,000 మంది విద్యార్థులతో సహా 18,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని చెప్పారు. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థను సహకరిస్తున్న భారతీయులను గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. 'ఆపరేషన్ అజయ్'కు ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. భవిష్యత్తులో యుద్ధ వాతావరణం ముగిసిన తర్వాత భారతీయులను ఇజ్రాయెల్‌కు తిరిగి స్వాగతిస్తున్నట్లు అన్నారు.