ETV Bharat / international

అణ్వస్త్ర పరీక్షకు కిమ్ సిద్ధం! టార్గెట్ అమెరికా!! - కిమ్​ జోంగ్​ ఉన్​ న్యూస్​

Kim Jong Un: అమెరికా సహా ప్రపంచ దేశాల హెచ్చరికలను పెడచెవిన పెడుతూ.. ఉత్తర కొరియా మరిన్ని ప్రమాదకర ఆయుధాల తయారీకి సిద్ధమైంది. త్వరలోనే అణ్వస్త్ర పరీక్షను కూడా జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

North Koreas Kim vows to develop more powerful means of attack

author img

By

Published : Mar 28, 2022, 4:36 PM IST

Kim Jong Un: ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో తగ్గేదే లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జో‌ంగ్​ ఉన్‌ పునరుద్ఘాటించారు. ఎవరూ అడ్డుకోలేని అఖండ సైనిక శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడే యుద్ధాన్ని నిరోధించగలమని పేర్కొన్నారు. అప్పుడే సామ్రాజ్యవాదుల బెదిరింపులను అడ్డుకోగలమని కిమ్‌ వ్యాఖ్యానించినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ-కేసీఎన్​ఏ పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా పరోక్షంగా అమెరికాకు కిమ్‌ గట్టి హెచ్చరికలు పంపారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టిన వేళ కిమ్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో అణ్వస్త్ర పరీక్షను కూడా ఉత్తరకొరియా చేపట్టే అవకాశం ఉందని ఈ ప్రకటన ద్వారా తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

గత వారం చేపట్టిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఉత్తర కొరియా 12 పరీక్షలు నిర్వహించింది. సుదూర లక్ష్యాలను ఛేదించే హ్వాసాంగ్-17 క్షిపణిని గత శుక్రవారం ప్రయోగించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగంలో ఎక్కడికైనా చేరుకునేలా రూపొందించారని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత శక్తిమంతమైన క్షిపణులను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తుందని కిమ్‌ పేర్కొన్నారు. నూతనంగా పరీక్షించిన హ్వాసాంగ్​‌-17.. 6 వేల 248 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని వెయ్యి 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది. ఈ క్షిపణి బహుళ అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి జపాన్‌, కొరియా ద్వీపకల్పం మధ్యలోని సముద్ర జలాల్లో లక్ష్యాన్ని ఛేదించింది. నిటారుగా ఈ క్షిపణిని ప్రయోగిస్తే 15 వేల కిలోమీటర్లు వరకు ఇది వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

అణు నిరాయుధీకరణపై 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కిమ్‌ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మరోసారి ఎలాంటి షరతులు లేకుండా ఉత్తర కొరియా చర్చలకు రావాలని బైడెన్‌ యంత్రాంగం ఆహ్వానించింది. అయితే ముందుగా తమ దేశంపై శత్రుత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా అమెరికాకు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. మరోవైపు ఆయుధాలను పెంచుకుని అమెరికాపై ఒత్తిడి పెంచాలని ఉత్తర కొరియా భావిస్తోంది. ఆయుధ సంపత్తిని విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కిమ్ త్వరలో మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్​తో.. హాలీవుడ్ స్టైల్​లో 'కిమ్​' ఎంట్రీ!

పుతిన్​కు ఉద్వాసన తప్పదా? మరో గోర్బచెవ్‌ అవుతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.