ETV Bharat / international

'రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌కు ఎవరూ చెప్పలేదు.. అవసరమైతే ఎక్కడైనా కొంటాం'

author img

By

Published : Oct 8, 2022, 12:38 PM IST

భారత్‌ తన చమురు అవసరాలు తీర్చుకునేందుకు ఏ దేశం నుంచైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. చమురు కొనుగోలు అంశంపై భారత్‌ వైఖరిని స్పష్టంచేశారు. రష్యా నుంచి ఇంధ‌నాన్ని కొనుగోలు చేయొద్దని భారత్‌కు ఏ దేశం చెప్పలేదని, తమ అవసరాల దృష్ట్యా ఎవ‌రి నుంచైనా ఇంధ‌నం కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు.

no-one-has-told-us-not-to-buy-crude-oil-from-russia-says-puri

దేశ పౌరులకు అవసరమైనంత ఇంధనాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉందని, దాని కోసం ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేస్తామని భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలని ఏ దేశమూ తమకు చెప్పలేదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ మాత్రం క్రెమ్లిన్‌ నుంచి ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తుండటంపై విమర్శలు వచ్చాయి. దీన్ని ఉద్దేశిస్తూనే హర్‌దీప్‌ సింగ్ పురి ఇలా వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్ పర్యటనలో ఉన్న పురి.. అక్కడ కొందరు భారత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చమురు ధరలు, కొనుగోళ్ల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు పురి సమాధానమిచ్చారు. "భారత్‌లో చమురు వినియోగం ఆధారంగానే ప్రభుత్వం కొనుగోళ్లు జరుపుతుంది. దేశ ప్రజలందరి అవసరాలకు తగినంత ఇంధనాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత సర్కారుపై ఉంటుంది. మన విధానాలపై మనకు స్పష్టత ఉంటే ఎక్కడి నుంచైనా చమురు కొనుగోళ్లు చేయొచ్చు. 'రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని భారత్‌కు ఎవరైనా చెప్పారా? అని మమ్మల్ని ప్రశ్నిస్తే.. మా సమాధానం కచ్చితంగా లేదు అనే వస్తుంది!" అని పురి వివరించారు.

ఆర్థిక వృద్ధికి ఇంధనం కీలకం
చమురు ధరల పెంపు గురించి పురి స్పందిస్తూ.. "ఉత్తర అమెరికాలో పెట్రోల్‌, డీజిల్ ధరలు 43 - 46 శాతం పెరిగితే.. భారత్‌లో కేవలం 2 శాతం మాత్రమే పెంచుతున్నాం. భారత్‌లో రోజూ 50 లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తున్నాం. ప్రపంచ సగటు తలసరి వినియోగంలో మూడో వంతు భారత్‌లోనే ఉంది. రానున్న కాలంలో ప్రపంచ డిమాండ్‌లో 25 శాతం భారత్‌ నుంచే ఉంటుంది. దేశ ఆర్థిక వృద్ధికి ఇంధనం కీలకంగా మారనుంది" అని చెప్పుకొచ్చారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై పెను ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంతో సరఫరాకు ఆటంకం కలగడమే గాక, సుదీర్ఘ కాలంగా ఉన్న వాణిజ్య సంబంధాలనూ దెబ్బతీసింది. దీంతో చాలా దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరిగి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు 50 రెట్లు పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 10 శాతానికి పెరిగింది. యుద్ధం నేపథ్యంలో రష్యా చౌక ధరకు చమురు విక్రయాలు జరపడమే అందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉత్పత్తిపై నిర్ణయాధికారం వారిదే..
ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడంపైనా పురి స్పందించారు. చమురు ఉత్పత్తి సామర్థ్యాలపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా ఒపెక్‌ దేశాలదే అని అన్నారు. ఒపెక్‌ దేశాల్లో భారత్‌ భాగం కాదని, అందువల్ల ఆ నిర్ణయంపై తాము స్పందించలేమన్నారు. చమురు ఉత్పత్తిని రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల మేర తగ్గిస్తూ ఒపెక్‌ దేశాలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయం యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.