ETV Bharat / international

ప్రయాణికులపైకి దూసుకెళ్లిన వాహనాలు.. ఇద్దరు చిన్నారులు సహా 20 మంది మృతి

author img

By

Published : Jan 30, 2023, 7:05 AM IST

Updated : Jan 30, 2023, 7:57 AM IST

నైజీరియాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు చోట్ల భారీ వాహనాలు బస్సులను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా 20 మంది మరణించారు.

NIGERIA ROAD CRASHES news
యాక్సిడెంట్

నైజీరియా లాగోస్​లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు చోట్ల భారీ వాహనాలు ప్రయాణికులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనల్లో 20 మంది మృతి చెందారు. ఓజులెగ్బా ప్రాంతంలో రద్దీగా ఉండే వంతెన వద్ద బస్సుపైకి 20 అడుగుల ఓ భారీ కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఎక్కుతున్న ఇద్దరు చిన్నారులు సహా 9 మంది ప్రయాణికులు మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సురక్షితంగా బయటపడింది.

మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున ఒండో రాష్ట్రంలోని ఒడిగ్బో కౌన్సిల్ ప్రాంతంలో మరో ట్రక్కు బస్సును ఢీకొట్టింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.

Last Updated : Jan 30, 2023, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.