Nepal Earthquake 2023 : హిమాలయన్ దేశం నేపాల్‌లో భూకంపం సంభవించి సుమారు 128 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అందుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు వెల్లడించారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
Nepal Earthquake News : అర్ధరాత్రి కావడం వల్ల పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదని చెప్పారు. ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. భూకంపం ధాటికి రోడ్లపై కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు దెబ్బతినడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. జజార్‌కోట్‌లో భూకంపం తర్వాత కూడా నాలుగు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత జాజర్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 6.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది.
మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం
Nepal Earthquake Today Damage జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే128 మంది మృతి చెందారు. ప్రధాన మంత్రి పుష్పకమల్ దహల్ భూకంప ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై నేపాల్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా తొమ్మిది వేల మంది మరణించారు
దిల్లీలోనూ భూప్రకంపనలు
Earthquake Tremors In Delhi : మరోవైపు, నేపాల్‌లోని భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలతో ఏం జరుగుతుందో తెలియక దిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.