ETV Bharat / international

ఫేస్​బుక్​లో లైవ్​ ఇస్తూ కాల్పులు.. కారులో ఊరంతా తిరుగుతూ దాడులు.. నలుగురు మృతి - అమెరికాలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. 19 ఏళ్ల యువకుడు మెంఫిస్ నగరంలో ఏడు చోట్ల కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

multiple shootings us 2022
అమెరికాలో కాల్పుల కలకలం
author img

By

Published : Sep 8, 2022, 1:27 PM IST

Updated : Sep 8, 2022, 2:17 PM IST

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్‌లో 19 ఏళ్ల ఎజెకిల్ కెల్లీ అనే యువకుడు ఫేస్​బుక్​లో లైవ్ ఇస్తూ, కారులో నగరమంతా తిరుగుతూ ఏడుచోట్ల కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ విధ్వంసం రాత్రి వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.

multiple shootings us
మెంఫిస్ నగరంలో కాల్పులు

నిందితుడు ఓ మహిళను హత్య చేసి.. ఆమె నుంచి టయోటా కారును స్వాధీనం చేసుకున్నాడు. ఈ దాడి దృశ్యాలన్నింటినీ ఫేస్​బుక్​లో లైవ్ ఇచ్చాడు. నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుండడం వల్ల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు. యూనివర్శిటీ ఆఫ్ మెంఫిస్ క్యాంపస్ సమీపంలోనే కాల్పులు జరిగాయని అక్కడి విద్యార్థులను అప్రమత్తం చేశారు. విశ్వవిద్యాలయానికి 4 మైళ్ల దూరంలో ఉన్న రోడ్స్ కళాశాలలో విద్యార్థులను ఆశ్రయం పొందమని, స్థానికులు ఇంట్లోనే ఉండాలని పోలీసులు సూచించారు. చివరకు నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు.

ఇవీ చదవండి: పార్లర్‌లో అగ్ని ప్రమాదం- 32 మంది మృతి

అమెరికాలో భారతి సంతతి వ్యక్తుల హవా.. విదేశాంగ శాఖలో ఒకరు​.. జిల్లా కోర్టు జడ్జిగా మరొకరు

Last Updated : Sep 8, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.