Morocco Earthquake 2023 : ఉత్తరాఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం సంభవించగా.. దాదాపు 296 మంది చనిపోయారు. 153 మందికి పైగా గాయపడ్డారు. బాధితులంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఈ విపత్తు సంభవించింది. యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తింపు పొందిన మర్రకేచ్ నగరానికి దక్షిణంగా.. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాస్ పర్వతాలలో భూకేంద్రాన్ని గుర్తించారు అధికారులు. 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మొరాకో భూకంప సంస్థ మాత్రం 8 కిలోమీటర్ల లోతులోనే సంభవించినట్లు పేర్కొంది.
Morocco Earthquake 2023 : భూకంప ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు పట్టణాలు, వివిధ ప్రాంతాల్లోని భవనాలు భారీగా దెబ్బతిన్నట్లు వారు వివరించారు. భూకంపానికి సంబంధించిన వీడియోలను 'ఎక్స్'లో షేర్ చేశారు మొరాకన్లు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భవనాలు కూలడం, దుమ్ము రేగడం వీటిలో మనం చూడొచ్చు. నిర్మాణాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీయడం, అరవడం గమనించవచ్చు. భూప్రకంపనల అనంతరం తిరిగి భవనాల్లోకి వెళ్లకుండా జనాలంతా వీధుల్లోనే గుమిగూడారాని స్థానికులు తెలిపారు.
-
🚨 #BREAKING | #Morocco | #earthquake | #Marrakech |#الزلزال | #المغرب
— Bot News (@BotNews18) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The moment a building completely collapsed following the earthquake that struck Morocco a short while ago. pic.twitter.com/9n22NfiC8F
">🚨 #BREAKING | #Morocco | #earthquake | #Marrakech |#الزلزال | #المغرب
— Bot News (@BotNews18) September 9, 2023
The moment a building completely collapsed following the earthquake that struck Morocco a short while ago. pic.twitter.com/9n22NfiC8F🚨 #BREAKING | #Morocco | #earthquake | #Marrakech |#الزلزال | #المغرب
— Bot News (@BotNews18) September 9, 2023
The moment a building completely collapsed following the earthquake that struck Morocco a short while ago. pic.twitter.com/9n22NfiC8F
Marrakech Earthquake : ప్రమాద స్థాయికి మర్రకేచ్ నగరం చుట్టూ ఉన్న ప్రసిద్ధ ఎరుపు గోడలు దెబ్బతిన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో విద్యుత్, రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. రోడ్లను క్లియర్ చేసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
-
BREAKING: 6.8 magnitude earthquake strikes Morocco, killing over 300 people.
— Hananya Naftali (@HananyaNaftali) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
My heart goes out to all those affected. Stay strong. 🇲🇦🙏 #Morocco pic.twitter.com/c2u56EA6DJ
">BREAKING: 6.8 magnitude earthquake strikes Morocco, killing over 300 people.
— Hananya Naftali (@HananyaNaftali) September 9, 2023
My heart goes out to all those affected. Stay strong. 🇲🇦🙏 #Morocco pic.twitter.com/c2u56EA6DJBREAKING: 6.8 magnitude earthquake strikes Morocco, killing over 300 people.
— Hananya Naftali (@HananyaNaftali) September 9, 2023
My heart goes out to all those affected. Stay strong. 🇲🇦🙏 #Morocco pic.twitter.com/c2u56EA6DJ
-
6.8 Earthquake reported in #Morocco pic.twitter.com/HgAAGlnujf
— Prof.N John Camm (@njohncamm) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">6.8 Earthquake reported in #Morocco pic.twitter.com/HgAAGlnujf
— Prof.N John Camm (@njohncamm) September 9, 20236.8 Earthquake reported in #Morocco pic.twitter.com/HgAAGlnujf
— Prof.N John Camm (@njohncamm) September 9, 2023
మోదీ సంతాపం
Modi on Morocco Earthquake 2023 : మొరాకో భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మొరాకోను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.