ETV Bharat / international

భారత్​లో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం.. అమెరికా ప్రశంసలు - భారత ప్రజాస్వామ్యంపై అమెరికా ప్రశంసలు

Modi Us Tour : భారత్​పై అద్భుతమైన ప్రశంసలు చేసింది అమెరికా. ఇక్కడ ప్రజాస్వామ్యం చైతన్యవంతంగా ఉందని కితాబిచ్చింది. అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు.. విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

modi-us-tour-american-appreciation-indian-democracy-america-on-indian-democracy
భారత ప్రజాస్వామ్యంపై అమెరికా ప్రశంసలు
author img

By

Published : Jun 6, 2023, 12:51 PM IST

America On Indian Democracy : భారత్‌లోని ప్రజాస్వామ్యానికి.. అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం నుంచి మంచి ప్రశంస లభించింది. భారత్‌ చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమని.. అక్కడికి వెళ్లి ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోవచ్చని.. శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్‌ కెర్బీ అన్నారు. ఆరోగ్యవంతమైన చర్చలోనే ప్రజాస్వామ్య సంస్థల బలం ఉంటుందని తాను భావిస్తున్నట్లు జాన్‌ కెర్బీ పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

"త్వరలో జరగబోయే నరేంద్ర మోదీ అమెరికా పర్యటన.. ఇరు దేశాల సంబంధాలను మరింత లోతుగా, బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినది. మీరు చూశారుగా.. ఆస్టిన్‌ (అమెరికా రక్షణ మంత్రి) ఇప్పటికే షంగ్రిలా సదస్సులో భారత్‌తో.. అమెరికా అదనపు రక్షణ సహకారానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇరుదేశాల వాణిజ్యంలో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాకపోతే.. భారత్‌ క్వాడ్‌లో సభ్య దేశం. ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో చాలా కీలకమైన భాగస్వామి భారత్‌. భారత్‌ ఎందుకు ముఖ్యమైన దేశమో.. నేను చాలా ఉదాహరణలు చెప్పగలను. ఈ సంబంధాలు మా ఇరు దేశాలకు మాత్రమే ముఖ్యమైనవి కావు.. బహుముఖంగా చాలా దశల్లో కీలకం. అందుకే ప్రధాని మోదీతో ఈ అంశాలను చర్చించి.. బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఎదురు చూస్తున్నారు" అని కెర్బీ వివరించారు.

మరోవైపు రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు.. భారత్‌, అమెరికా తాజాగా ఓ ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాయి. దీంట్లో భాగంగా పలు మిలిటరీ ప్లాట్‌ఫాంలు, హార్డ్‌వేర్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌తో సోమవారం సమావేశమయ్యారు. దిల్లీలో ఈ సమావేశం జరిగింది.

మోదీ అమెరికా పర్యటన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్​తో జూన్​ 22న మోదీ సమావేశమవుతారు. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను సైతం విడుదల చేసింది. ఈ సమావేశంలో ఇరువురి మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి.. బైడెన్ అధికారికంగా విందు ఇస్తారని శ్వేతసౌధం వివరించింది. అమెరికా, భారత్ మధ్య ఉన్న లోతైన, బలమైన భాగస్వామ్యానికి మోదీ పర్యటన అద్దం పడుతుందని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్ పియర్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.