ETV Bharat / international

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కాల్పులు.. ఎనిమిది మంది మృతి - mexixo latest news

Mexico City Shooting: మెక్సికో నగర సమీప ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Gunmen kill family mexico
మెక్సికోలో కాల్పుల కలకలం
author img

By

Published : Apr 12, 2022, 9:27 AM IST

Mexico City Shooting: మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. మెక్సికో సిటీ తుల్టెపెక్​ ప్రాంతంలోని ఓ ఇంటిలోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిల్లలు ఉన్నారు. దేశ రాజధాని సరిహద్దులో ఉన్న తుల్టెపెక్ టౌన్​షిప్​లో ఈ కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున మధ్య (స్థానిక కాలమానం ప్రకారం) నిందితులు ఈ కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రాణం తీసిన సరదా: మరోవైపు అమెరికాలోని ఫ్లోరిడాలో కూడా కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల్లో ఓ టీనేజర్​ మృతిచెందాడు. బుల్లెట్​ ఫ్రూఫ్ జాకెట్​లను ధరించి ఇద్దరు మిత్రులు ఒకరిని ఒకరు కాల్చుకున్నారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ బ్రాడ్(15) అనే వ్యక్తి మరణించాడు. ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడు మరణానికి కారణమైన 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌తో చైనీయులు ఉక్కిరిబిక్కిరి.. ఆహారం కోసం అరుపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.