ETV Bharat / international

ట్రంప్ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లు పునరుద్ధరణ.. రెండేళ్ల తర్వాత..

author img

By

Published : Jan 26, 2023, 8:49 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించింది మెటా. తన ఫేస్​బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం వల్ల ఆ సంస్థ బిలియన్ డాలర్లు నష్టపోయిందని ట్రంప్ అన్నారు.

donald trump facebook
డొనాల్డ్ ట్రంప్ ఫేస్​బుక్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు ఊరట లభించింది. రెండేళ్ల నిషేధం అనంతరం ట్రంప్ ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ ఖాతాలను ఆయా సంస్థల మాతృసంస్థ మెటా పునురుద్ధరించింది. అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను ప్రశంసించినందుకుగాను ట్రంప్​ ఫేస్​బుక్​ ఖాతాను మెటా 2021 జనవరి 7న సస్పెండ్ చేసింది. ట్రంప్​కు ఫేస్​బుక్​లో 34 మిలియన్లు, ఇన్​స్టాగ్రామ్​లో 23 మిలియన్ల ఫాలోవర్లు అన్నారు.

తన ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలను మెటా పునరుద్ధరించడంపై డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్​లో స్పందించారు. 'నా వ్యక్తిగత ఫేస్​బుక్ ఖాతాను ఆ సంస్థ మాతృసంస్థ పునరుద్ధరించింది. నా ఖాతాను సస్పెండ్ చేయడం వల్ల ఫేస్​బుక్ బిలియన్ డాలర్లు నష్టపోయింది' అని ట్రంప్ అన్నారు.
అంతకుముందు గతేడాది నవంబరులో డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్​ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ట్విట్టర్​లో పోల్‌ నిర్వహించిన తర్వాత ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్​ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.