Shinzo Abe Shot: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. శుక్రవారం నరా నగరంలోని ఓ వీధిలో ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. నరా నగరానికి చెందిన 41 ఏళ్ల యమగామి ఎట్సుయా.. మాజీ ప్రధానిపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని ఘటనాస్థలం వద్దే పట్టుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఓ తుపాకీని పోలీసులు గుర్తించారు. ఆ ఆయుధంతోనే దుండగుడు కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
-
Braking:
— Firoz Saifi (@0x_bigwin_india) July 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The gunman that shot Former PM Shinzo Abe #japan #ShinzoAbe #shinzo pic.twitter.com/ff1FKlVbLW
">Braking:
— Firoz Saifi (@0x_bigwin_india) July 8, 2022
The gunman that shot Former PM Shinzo Abe #japan #ShinzoAbe #shinzo pic.twitter.com/ff1FKlVbLWBraking:
— Firoz Saifi (@0x_bigwin_india) July 8, 2022
The gunman that shot Former PM Shinzo Abe #japan #ShinzoAbe #shinzo pic.twitter.com/ff1FKlVbLW
కేవలం 10 అడుగుల దూరంలోనే.. షింజో అబేను అత్యంత సమీపం నుంచే కాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అబేకు వెనుకవైపు 10 అడుగుల దూరంలోకి వచ్చి నిందితుడు యమగామి షార్ట్ గన్‌తో రెండుసార్లు కాల్పులు జరిపినట్లు జపాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాల్పుల అనంతరం అతడు పారిపోతున్న దృశ్యాలు.. పోలీసులు పట్టుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
వేదికపైనే కుప్పకూలిన అబే.. కాల్పుల గాయాలతో షింజో ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. ఆయన్ను హుటాహుటిన హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే షింజో శరీంలో కదలికలు లేనట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించే సమయంలో ఆయన శ్వాస తీసుకోలేదని, హృదయం కూడా స్పందిచలేదని స్థానిక ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని జపాన్ మీడియా వెల్లడించింది. జపాన్‌లో అధికారికంగా మరణాన్ని ధ్రువీకరించడానికి ముందు ఈ పదాన్ని తరచూ ఉపయోగిస్తుంటారు.
ఇవీ చదవండి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు.. పరిస్థితి విషమం!