Post Covid Symptoms In Children: చిన్నారుల్లో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు కనీసం రెండు నెలల పాటు కనిపించే అవకాశముందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. అలసట, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి వారిని ఎక్కువగా వేధిస్తున్నట్లు నిర్ధరించింది. డెన్మార్క్‌లో 2020 జనవరి నుంచి 2021 జులై మధ్య కరోనా మహమ్మారి బారిన పడిన 11 వేల మంది పిల్లల ఆరోగ్య పరిస్థితిని.. ఎన్నడూ కొవిడ్ సోకని 33 వేల మంది చిన్నారులతో పోల్చిచూడటం ద్వారా కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయం ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఆ పిల్లలందరూ 14 ఏళ్లలోపువారే. దీర్ఘకాలిక కొవిడ్ నిర్వచనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న 23 అనారోగ్య లక్షణాలు వారిలో ఎంతమేరకు ఉన్నాయో పరిశీలించారు. 0-3 ఏళ్ల వయసువారిలో 40% మంది, 4-11 ఏళ్ల వారిలో 38% మంది, 12-14 ఏళ్లవారిలో 41% మంది దీర్ఘకాలిక కొవిడ్‌తో ఇబ్బంది పడినట్లు నిర్ధరించారు. వారిలో కనీసం ఏదైనా ఒక అనారోగ్య లక్షణం రెండు నెలల పాటు కొనసాగినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: బ్రిక్స్ సహకారానికి పుతిన్ పిలుపు.. ఇజ్రాయెల్‌పై జెలెన్స్కీ గరం
పెట్రోల్ కోసం క్యూలో ఐదు రోజులు.. వెయిట్ చేస్తూ డ్రైవర్ మృతి