ETV Bharat / international

సింహం బిర్యానీ, పులి పకోడీ.. రుచి చూసేందుకు గెట్ రెడీ.. లీగల్​గానే! - పులి పకోడి

Lion Meat: 'చికెన్, మటన్​తో వంటకాలు పాత పద్ధతి.. సింహం, పులి, ఏనుగు, జిరాఫీ మాంసం డిషెస్ ఇప్పుడు నయా ట్రెండ్​' అంటోంది ఓ స్టార్టప్ కంపెనీ. త్వరలోనే ఆయా వంటల టేస్టింగ్​ సెషన్​ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అసలు ఇదంతా ఎలా సాధ్యం? వన్యమృగాల మాంసంతో వంటలు చేయడం నేరం కాదా? అవి తింటే మనుషులకేం కాదా?

lab-grown-food-startup-will-soon-serve-lion-tiger-and-elephant-meat
సింహం బిర్యానీ, పులి పకోడీ.. టెస్ట్ చేసేందుకు గెట్ రెడీ.. లీగల్​గానే!
author img

By

Published : Apr 2, 2022, 4:53 PM IST

Tiger Meat: సింహం బర్గర్.. పులి మాంసం నగ్గెట్స్​.. ఏనుగు నూనెతో చేసిన క్రీమీ చీజ్​కేక్.. జీబ్రా సుషీ రోల్స్​.. జిరాఫీ హ్యామ్​... త్వరలో జరగబోయే ఓ ఫుడ్​ ఫెస్టివల్​ మెనూలో భాగమిది. ఇదంతా చూస్తే 'ఏప్రిల్​ ఫూల్​' ప్రాంక్​ను ఆలస్యంగా చేస్తున్నారని అనుకున్నారా? కానే కాదు. ఇది ముమ్మాటికీ నిజం. చట్టబద్ధం కూడా. ఇదంతా ఎలా సాధ్యమని అనుకుంటున్నారా?
స్టార్టప్​ కంపెనీ వెరైటీ ఆలోచన: చికెన్, మటన్, బీఫ్, పోర్క్.. దాదాపు అన్ని దేశాల్లో తినే మాంసాహారాలు ఇవే. వన్యమృగాల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. చట్టం సంగతి పక్కనబెడితే.. అసలు వాటిని తినాలన్న ఆలోచనే ఎవరికీ రాదు. ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించింది లండన్​ కేంద్రంగా పనిచేసే ప్రిమేవల్ ఫుడ్స్ అనే అంకుర సంస్థ. సెల్యూలర్ వ్యవసాయంతో ముడిపడిన వ్యాపారం చేసే ఆ సంస్థ.. జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్​లోనే వన్యమృగాల మాంసాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని అనుకుంది.

ల్యాబ్​లో మాంసం అభివృద్ధి కొత్తేం కాదు. జంతువుల కణాలను ప్రాసెస్(సెల్ కల్చరింగ్) చేసి పరిశోధనశాలలోనే తయారు చేసిన చికెన్, మటన్ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఈ రంగంలో ఉన్న అవకాశాల్ని సొమ్ము చేసుకునేందుకు అనేక ఫుడ్​ టెక్​ కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకే ప్రిమేవల్ ఫుడ్స్ మరో అడుగు ముందుకేసింది. 'వీటిని కూడా తింటారా?' అని జనం అనుకునే జంతువులపై దృష్టిపెట్టింది.

Elephant Meat: "మనం చికెన్, బీఫ్​ వంటి వాటికే పరిమితం కావడానికి.. అవి రుచికరం, ఆరోగ్యకరం, పోషకాలతో కూడుకున్నవి అనేవి మాత్రమే కారణాలు కాదు. ఆ జంతువులను పెంచడం సులువు కాబట్టే మనం వాటికి ఎక్కువగా అలవాటుపడ్డాం. ఇప్పుడు ల్యాబ్​లో అభివృద్ధి చేసే మాంసం విషయంలో మనం ఆ సంప్రదాయ జంతువుల్ని దాటి వెళ్లొచ్చు. మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడుకున్న మాంసాల్ని అభివృద్ధి చేయవచ్చు. ఇలాంటి వాటి వల్ల కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఇబ్బందులు లేకుండా మన మెదడు, జీర్ణవ్యవస్థలో సరికొత్త మార్పులు వచ్చే అవకాశముంది. ఆయా జంతువుల మాంసంలోని ప్రొటీన్, ఎమైనో యాసిడ్​ ప్రొఫైల్​లోని విలక్షణత ఇందుకు కారణం. నిద్ర బాగా పట్టేందుకు ఉపకరించే జాగ్వార్ మాంసం, మన ఆలోచనా శక్తిని మెరుగుపరిచే ఏనుగు మాంసం అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం." అని వివరించారు ప్రిమేవల్ ఫుడ్స్​ పెట్టుబడిదారు సంస్థ అయిన ఏస్ వెంచర్స్​ మేనేజింగ్ పార్ట్​నర్​ యిల్మాజ్ బోరా.

lion-tiger-meat
ప్రిమేవల్ ఫుడ్స్ మెనూ

త్వరలోనే రుచి చూపిస్తాం: వన్యమృగాల మాంసంతో చేసిన వంటకాలను ప్రపంచానికి రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది ప్రిమేవల్ ఫుడ్స్. రానున్న నెలల్లో లండన్​లో టేస్టింగ్ సెషన్​ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ మెనూను రూపొందించి, విడుదల చేసింది.

lion-tiger-meat
ప్రిమేవల్ ఫుడ్స్ మెనూ
"ఈ మాంసాల అభివృద్ధి కోసం మేము జంతువులను ఇబ్బంది పెట్టం. జంతుప్రదర్శనశాలలో ఉన్న ముగజీవుల నుంచి వాటి కణాలను సేకరిస్తాం. వాటిని ల్యాబ్​లో కల్చరింగ్ చేస్తాం. ఈ మాంసం గురించి వినేందుకు వింతగా ఉన్నా.. జంతువులను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి రుచి చూసేందుకు చాలా మంది ముందుకు వస్తారనే భావిస్తున్నాం." అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రిమేవల్ ఫుడ్స్​.
lion-tiger-meat
ప్రిమేవల్ ఫుడ్స్ మెనూ

ఇదీ చదవండి: ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ పెళ్లి.. ఆ జంట వెరైటీ 'రాజీ' ఫార్ములా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.