Khalistan Referendum : భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ... ఖలిస్థానీ సానుభూతిపరులు మరోసారి రెఫరెండం నిర్వహించారు. ఈ అనధికార ఓటింగ్‌లో వేల సంఖ్యలో ఖలిస్థానీ అనుకూలవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో రెఫరెండం నిర్వహించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నట్లు చెబుతున్నప్పటికీ.. ఈ సంఖ్యపై స్పష్టత లేదు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన గురుద్వారా దగ్గరే.. ఈ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఖలిస్థానీ మద్దతుదారులు పాల్గొన్నప్పటికీ.. అనేక మంది సిక్కులు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులు గతంలోనూ రెఫరెండం జరిపారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కెనడా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
Canada Diplomats India : భారత్‌తో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ఇటీవల ఇక్కడ పనిచేస్తున్న 41 మంది దైత్యవేత్తలను వెనక్కి రప్పించింది కెనడా. దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి మెలాని జోలి వెల్లడించారు. భారత్‌లో మొత్తం 62 మంది దౌత్యవేత్తలు ఉండగా.. వారిలోని 41 మందితో పాటు సిబ్బంది, కుటుంబ సభ్యులను వెనక్కి పిలిచింది కెనడా. మిగిలిన 21 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా దౌత్యవేత్తల రక్షణను ఉపసంహరించుకోవడం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు, ముఖ్యంగా జెనీవా ఒప్పందానికి పూర్తిగా విరుద్ధమని చెప్పారు విదేశాంగ మంత్రి మెలాని జోలి. భారత్ చేసిన విధంగా కెనడా చేయబోదని తెలిపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరు దేశాల్లోని పౌరులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు.
India Canada Relations : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడాల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. దీంతో తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని రెండు దేశాలు అడ్వైజరీలు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
India Canada Visa News : కెనడాలో వీసాల జారీ ప్రారంభం.. కానీ ఓ ట్విస్ట్
India Canada Visa Issue : 'కెనడాలో భారత్ దౌత్యవేత్తలు సేఫ్ అనుకుంటేనే.. కొత్త వీసాల జారీ!'