ETV Bharat / international

నీట మునిగిన పడవ.. 26 మంది పర్యటకులు గల్లంతు!

Japan Boat Missing: జపాన్​లో 26 మంది పర్యటకులతో ప్రయాణిస్తున్న ఓ బోటు గల్లంతైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పడవ మునిగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నా.. ఇప్పటివరకు ఏ ఒక్కరి ఆచూకీ తెలియలేదు.

boat
boat
author img

By

Published : Apr 24, 2022, 5:24 AM IST

Japan Boat Missing: జపాన్‌లో పర్యాటక బోటు గల్లంతైంది. షెరిటికో ద్వీపకల్పం వద్ద 26 మంది పర్యాటకులతో వెళ్లిన కాజు-1 పడవ సంబంధాలను కోల్పోయినట్టు జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటించింది. బోటు ఆచూకీ కోసం నాలుగు హెలికాప్టర్లతో పాటు ఆరు పెట్రోలింగ్‌ బోట్‌లతో గాలిస్తున్నారు. బోటులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. జపాన్‌ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.15గంటల ప్రాంతంలో ఈ బోటు సంబంధాలు కోల్పోయింది. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్కరి ఆచూకీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

హక్కైడో ఉత్తర ద్వీపంలో షెరిటొకో ద్వీపకల్పం వద్ద శనివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున గాలులు వీయడంతో ఈ పడవ మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం నెలకొనడం వల్ల మత్స్యకార పడవలు కూడా తిరిగి వచ్చేశాయని జపాన్‌ మీడియా పేర్కొంది. గల్లంతైన బోటులో 24మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు.

లెబెనన్​లో కూడా ఓ బోటు ప్రమాదానికి గురైంది. వలసదారులు ప్రయాణిస్తున్న ఈ పడవ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో 45 మందిని కాపాడమని ఓ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మిగతా వారు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : నాలుగేళ్ల చిన్నారికి విస్కీ.. అమ్మ, నాయనమ్మ జైలుకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.