ETV Bharat / international

'నా భార్యకు రేప్ డ్రగ్ ఇచ్చేవాడిని- మా మ్యారేజ్ సీక్రెట్ అదే'- UK హోంమంత్రి వ్యాఖ్యలపై దుమారం - జేమ్స్ క్లెవర్లీ రేప్ డ్రగ్ న్యూస్

James Cleverly Wife Drugs : తన భార్యకు ప్రతి రాత్రి డ్రింక్స్​లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడనినని యూకే హోంమంత్రి జేమ్స్ క్లెవర్లీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. క్లెవర్లీ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

james-cleverly-wife-drugs
james-cleverly-wife-drugs
author img

By PTI

Published : Dec 24, 2023, 10:43 PM IST

James Cleverly Wife Drugs : వివాదాస్పద వ్యాఖ్యలతో బ్రిటన్ హోంమంత్రి జేమ్స్ క్లెవర్లీ ఆ దేశంలో మహిళా సంఘాల ఆగ్రహం ఎదుర్కొంటున్నారు. తన భార్యకు ప్రతి రాత్రి డేట్ రేప్ డ్రగ్ ఇచ్చేవాడినని ఓ పార్టీలో వ్యాఖ్యానించి సంచలనంగా మారారు. దీర్ఘకాల వైవాహిక బంధానికి అదే రహస్యమంటూ ఆయన చెప్పినట్లు అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా క్లెవర్లీ స్పందించారు. అది కేవలం జోక్ అని చెప్పుకొచ్చారు. అలాంటి డ్రగ్​ను చట్టవిరుద్ధంగా మార్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ప్రధానమంత్రి రిషి సునాక్ నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్​లో డిసెంబర్ 18న జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో మాట్లాడుతూ జేమ్స్ క్లెవర్లీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు సండే మిర్రర్ న్యూస్ పేపర్ తెలిపింది. 'భార్య రోజూ కాస్త మత్తులో ఉండటమే దీర్ఘకాల వైవాహిక బంధానికి రహస్యం. ఎందుకంటే ఇంకా మంచి వ్యక్తులు బయట ఉన్న విషయాన్ని వారు గుర్తించలేరు. డేట్ రేప్ డ్రగ్​గా పిలిచే రోహిప్నాల్​ను నేను ఆమె తాగే డ్రింక్​లో ప్రతి రోజు రాత్రి కలిపేవాడిని. కొద్ది మొత్తంలో కలిపితే అదేం చట్టవిరుద్ధం కాదు' అని క్లెవర్లీ వ్యాఖ్యానించినట్లు సండే మిర్రర్ పేర్కొంది.

'ప్రజలకు తెలియాలనే'
డ్రింక్స్ రిసెప్షన్​లో ప్రధానితో పాటు రాజకీయ జర్నలిస్టులు, నాయకులు, మంత్రులు పాల్గొన్నట్లు సండే మిర్రర్ పేర్కొంది. ఇలాంటి ఈవెంట్లలో మాట్లాడే విషయాలు ఆఫ్ ది రికార్డ్ అయినప్పటికీ- సంబంధిత అంశంపై క్లెవర్లీ అభిప్రాయాలు ప్రజలకు తెలియాలని దీనిపై రిపోర్ట్ చేసినట్లు వివరించింది.

'జోక్ చేశా'
అయితే, ఈ వివాదంపై క్లెవర్లీ తన ప్రతినిధి ద్వారా క్షమాపణ కోరారు. తాను కేవలం జోక్ చేశానని చెప్పారు. అలాంటి ఘటనలకు పాల్పడటం నేరమని అన్నారు. డ్రింక్స్​లో అలాంటి మత్తుపదార్థాలు కలపడాన్ని చట్టవిరుద్ధంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని క్లెవర్లీ చెప్పుకొచ్చారు.

నెలకు 561 కేసులు
క్లెవర్లీ పేర్కొన్న డ్రగ్​ను రూఫీగా కూడా పిలుస్తారు. ఆ మాత్రను పొడిలా చేసి ఏదైనా పానీయంలో కలిపితే దాన్ని తాగిన వారికి మగతగా అనిపిస్తుంది. కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం సైతం జరగొచ్చు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ పోలీసు శాఖ వద్దకు ఇలాంటివి నెలకు సగటున 561 కేసులు వస్తుంటాయి. బార్లు, నైట్ క్లబ్​ల వద్ద ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని హోంశాఖ తన నివేదికలో పేర్కొంది.

తీవ్ర దుమారం
క్లెవర్లీ వ్యాఖ్యలపై మహిళా హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. క్లెవర్లీ వ్యాఖ్యలు విచారకరమని మహిళా హక్కుల సంస్థ 'ఫావ్సెట్ సొసైటీ' చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెమిమా ఓల్​చావ్స్కీ పేర్కొన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష లేబర్ పార్టీ ఎంపీలు సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. డ్రింక్స్​లో మత్తు మందులు కలపడంపై ప్రభుత్వం నూతన విధానం ప్రకటించిన రోజే క్లెవర్లీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేరాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందో లేదో అనే అనుమానాలు ఇప్పుడు బాధితుల్లో తలెత్తుతాయని పేర్కొన్నారు.

'ఇచ్చిన హామీలను మర్చిపోయారు, ప్రధాని పదవికి అనర్హుడు'- సునాక్​పై బ్రేవర్మన్​ ఘాటు విమర్శలు

బ్రిటన్​ హోంమినిస్టర్​పై సునాక్​ వేటు- మాజీ ప్రధానికి విదేశాంగ మంత్రి పదవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.