ETV Bharat / international

'భారత్‌, రష్యాది బలమైన బంధం'- ప్రధాని మోదీకి పుతిన్​ ఆహ్వానం - రష్యా తాజా వార్తలు

Jaishankar Russia Visit : భారత్​, రష్యా మధ్య సంబంధాలు కాలపరీక్షకు తట్టుకుని నిలిచాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జైశంకర్ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో భేటీ అయ్యారు జైశంకర్​. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీని పుతిన్​ రష్యాకు ఆహ్వానించారు.

Jaishankar Russia Visit
Jaishankar Russia Visit
author img

By PTI

Published : Dec 28, 2023, 8:26 AM IST

Updated : Dec 28, 2023, 9:23 AM IST

Jaishankar Russia Visit : భారత్‌కు ర‌ష్యా విలువైన, కాలపరీక్షకు నిలిచిన భాగస్వామి అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. మాస్కోలో పర్యటిస్తున్న ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య ఉన్న సంబంధాల ద్వారా ఇరుదేశాలు విస్తృతంగా ప్రయోజనం పొందినట్లు చెప్పారు. అంతర్జాతీయ వ్యుహాత్మక పరిస్థితులు, ఘర్షణలు, ఉద్రిక్తతలు, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించినట్లు జైశంకర్‌ తెలిపారు.

  • #WATCH | External Affairs Minister Dr S Jaishankar says, "First of all, please allow me to convey the personal greetings of Prime Minister Modi...I would also, extensive like to take the opportunity to share with you, aspects of the progress that we have made and in the last two… pic.twitter.com/R5jNOe1CVM

    — ANI (@ANI) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ-పుతిన్‌లు నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారని, గ్లోబల్‌ సౌత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు, భిన్న ధ్రువ ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేవడంపై దృష్టి సారించామని జైశంకర్‌ వివరించారు. ప్రత్యేకమైన తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. జీ-20, షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌, ఆసియాన్‌, బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలు వరుస భేటీలకు దోహదం చేస్తున్నాయని జైశంకర్‌ పేర్కొన్నారు.

మోదీకి పుతిన్ ఆహ్వానం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్‌ క్రెమ్లిన్‌లో బుధవారం భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలపై ఆయనతో చర్చించారు. వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీకి పుతిన్‌ ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. వర్తమాన అంశాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయన పర్యటన దోహదపడుతుందని చెప్పారు. ఉక్రెయిన్‌ సంక్షోభం శాంతియుతంగా పరిష్కృతమవ్వాలని మోదీ కోరుకుంటున్న సంగతి తనకు తెలుసని పుతిన్‌ పేర్కొన్నారు. దాని గురించి తామిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితిపై భారత్‌కు మరింత అదనపు సమాచారం అందజేస్తామన్నారు. భారత్‌తో తమ దేశ వాణిజ్య లావాదేవీల్లో వరుసగా రెండో ఏడాది గణనీయ పెరుగుదల నమోదవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ముడి చమురు, అత్యాధునిక సాంకేతిక రంగాలు ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

  • EAM Dr S Jaishankar tweets, "Honoured to call on President Vladimir Putin this evening. Conveyed the warm greetings of PM Narendra Modi and handed over a personal message. Apprised President Putin of my discussions with Ministers Manturov and Lavrov. Appreciated his guidance on… pic.twitter.com/A9MggwPVtr

భారత్​కు శాస్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే! : సెర్గీ లవ్రోవ్‌
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు పలుకుతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ ప్రకటించారు. దిల్లీ వేదికగా ఈ ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆ జీ20 సదస్సును భారత దౌత్య విధానాలకు దక్కిన నిజమైన గెలుపుగా అభివర్ణించారు. జీ20 కూటమి అధ్యక్ష స్థానంలో ఉండి అన్ని సభ్యదేశాల ప్రయోజనాలను భారత్‌ పరిరక్షించిందంటూ కితాబిచ్చారు. 'మేకిన్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగా భారత్​లో అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సెర్గీ లవ్రోవ్‌ చెప్పారు. ఉత్తర-దక్షిణ రవాణా నడవా త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు.

  • #WATCH | Moscow: Russian President Vladimir Putin says, "Despite all the turmoil happening worldwide, the relationship with our true friends in Asia-India has been progressing incrementally...Regarding the situation in Ukraine, many times I advised him of how things have been… pic.twitter.com/5z2RBf8Ogz

మరోవైపు, ఎన్​ఎస్​టీసీ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని జైశంకర్​ తెలిపారు. దాన్ని పూర్తిచేయడానికి తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఈ రవాణా నడవా ఏర్పాటు కోసం భారత్‌, రష్యా, ఇరాన్‌ 2000వ సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత ఆ నడవాలో భాగస్వామ్య పక్షాల సంఖ్య 14కు పెరిగింది. రష్యా నుంచి మరింత అధిక సంఖ్యలో పర్యటకులు భారత్‌కు రావాలని కోరుకుంటున్నామని జైశంకర్‌ చెప్పారు. అందుకు అనుగుణంగా అనుసంధానత సదుపాయాల పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

'ఉక్రెయిన్​లో 6లక్షల మంది రష్యన్ సైనికులు- లక్ష్యాలేం మారలేదు, యుద్ధం కంటిన్యూ!'

Russian Key Interest Rates Hike : రష్యన్​ రూబుల్ పతనం.. వడ్డీ రేట్లు భారీగా పెంపు!

Last Updated : Dec 28, 2023, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.