ETV Bharat / international

'రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై వెనక్కి తగ్గం'.. తేల్చి చెప్పిన జైశంకర్ - ukraine russia war on jaishankar

Jaishankar On Russian Oil Imports: రష్యా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి జైశంకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని జైశంకర్ తెెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన కోరారు.

jaishankar on russian oil imports
జైశంకర్ రష్యా పర్యటన
author img

By

Published : Nov 8, 2022, 9:48 PM IST

Jaishankar On Russian Oil Imports : రష్యా నుంచి ముడిచమరు కొనుగోలు విషయంలో భారత్‌ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తేల్చిచెప్పారు. రష్యా రాజధాని మాస్కోలో పర్యటిస్తున్న జైశంకర్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి షెర్గీ లావ్‌రోవ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇదే సమయంలో.. పలు అంతర్జాతీయ అంశాలపైనా సమాలోచనలు జరిపారు. పరస్పర ప్రయోజనకరమైన అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా చర్చలు జరిపినట్లు సమావేశం తర్వాత జైశంకర్‌ వెల్లడించారు.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్ ప్రస్తుతం ఉన్న ఇంధనం, గ్యాస్‌ ధరలను భరించే స్థితిలో లేదని స్పష్టం చేశారు జైశంకర్. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిళ్లను పరోక్షంగా తోసిపుచ్చారు. తమకు ప్రయోజనం ఉంటుందంటే.. చమురు కొనుగోళ్లను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఇదేసమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని జైశంకర్‌ కోరారు. యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని వివరించారు.

"ఇది యుద్ధం చేసే శకం కాదని సెప్టెంబర్‌లో సమర్ఖండ్‌లో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ.. అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి వివాదం నడిచినా.. దానితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. దానివల్ల తీవ్ర పరిణామాలు జరగడానికి వీల్లేదు. ఇప్పటికే ఇంధనం, ఆహారభద్రత విషయంలో అనేక విపరిణామాలు ఎదుర్కొంటున్నాం. రెండేళ్ల పాటు కొవిడ్‌ కారణంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురయ్యాయి. కొవిడ్, యుద్ధం చేస్తున్న గాయాల తాలూకూ బాధను ప్రపంచ దేశాలు అనుభవిస్తూనే ఉన్నాయి. అందుకే తక్షణమే దౌత్య పద్ధతిలో చర్చలు చేపట్టాలని భారత్‌ గట్టిగా సూచిస్తోంది. మేమెప్పుడూ శాంతి వైపే ఉంటాం. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస విధానాలను గౌరవిస్తాం."
-ఎస్‌.జైశంకర్‌, విదేశాంగ శాఖ మంత్రి

ఇవీ చదవండి: 'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు

'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.