ETV Bharat / international

'మా నిర్ణయంతోనే చమురు ధరలకు కళ్లెం- ప్రపంచ దేశాలు భారత్​కు థ్యాంక్స్​ చెప్పాలి'

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 7:44 PM IST

Jaishankar On Russian Oil Imports : రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయంగా మార్కెట్‌ ధరలు పెరగకుండా నియంత్రించగలిగామని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. అందుకు భారత్‌కు ప్రపంచ దేశాలు కృతజ్ఞతలు చెప్పాలని.. దాని కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.

Jaishankar On Russian Oil Imports
Jaishankar On Russian Oil Imports

Jaishankar On Russian Oil Imports : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ తన కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్‌ ధరలు పెరగకుండా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పేర్కొన్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌లో పర్యటిస్తున్న జైశంకర్​.. లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చమురు ధరలు కట్టడి చేసినందుకు మిగిలిన దేశాలు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.

Jaishankar On Buying Russian Oil : "భారత్ కొనుగోలు విధానాల ద్వారా అంతర్జాతీయ చమురు, ఇంధన మార్కెట్లు ధర ఒడుదొడుకులకు గురికాకుండా చేసింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూసేందుకు ఆ విధానాలు బాగా ఉపయోగపడ్డాయి. అందుకు భారత్‌కు ప్రపంచ దేశాలన్నీ కృతజ్ఞతలు చెప్పాలి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఒకవేళ రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు విక్రేతల వద్దకే మేము కూడా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు చమురు ధరలు మనం ఊహించనంతగా పెరిగేవి. ఫలితంగా అదే ధరలకు ఐరోపా కూడా చమురు కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎల్‌పీజీ మార్కెట్లలో ఆసియాకు రావాల్సిన పెద్ద సరఫరాదారులు ఐరోపాకు తరలిపోయారు. కొన్ని చిన్న దేశాలు ఎల్‌పీజీ ఇంధన కొనుగోలు కోసం దాఖలు చేసిన టెండర్లపై స్పందించేందుకు కూడా సరఫరాదారులు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో రష్యాతో భారత్‌ తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది" అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

'ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు'
Jaishankar On Canada Allegations : మరోవైపు, కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్​ సింగ్​ నిజ్జర్​ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై జైశంకర్​ స్పందించారు. భారత్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కెనడా తమకు ఇవ్వలేదని తెలిపారు. "కెనడా అధికారులకు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాం. వారు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే భారత్‌తో పంచుకోవాలని కోరాం. దీనికి సంబంధించి దర్యాప్తును మేము తిరస్కరించడంలేదు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడుకుని ఉంది. రాజకీయాల కోసం దాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే హింసాత్మక, రాజకీయవాదులకు కెనడా తన రాజకీయాల్లో స్థానం కల్పించింది" అని జైశంకర్​ తెలిపారు.

రిషి సునాక్​కు 'కోహ్లీ బ్యాట్' గిఫ్ట్- మోదీ తరఫున దీపావళి విషెస్​ చెప్పిన జైశంకర్

'ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం!'.. బాధిత కుటుంబాలకు జైశంకర్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.