ETV Bharat / international

చంద్రయాన్​ 3 విజయంపై ప్రపంచం హర్షం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు - chandrayaan 3 landing time today news

Isro Chandrayaan 3 Wishes : చంద్రయాన్​ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి.

Isro Chandrayaan 3 Wishes
Isro Chandrayaan 3 Wishes
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 9:15 PM IST

Updated : Aug 23, 2023, 10:54 PM IST

Isro Chandrayaan 3 Wishes : చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్​పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్​ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో పాటు యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రోకు అభినందనలు తెలిపాయి.

ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
చంద్రయాన్​ 3 విజయం కావడం వల్ల ఇస్రో బృందాన్ని అభినందించారు నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ విజయవంతమైనందుకు అభినందనలు చెప్పారు. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా నిలిచిన భారత్‌ను ప్రశంసించారు. చంద్రయాన్‌-3లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు బిల్‌ నెల్సన్‌. మరోవైపు చంద్రయాన్​ 3 విజయం పట్ల బ్రిటన్​ అంతరిక్ష పరిశోధన సంస్థ సైతం అభినందనలు తెలిపింది.

  • Congratulations @isro on your successful Chandrayaan-3 lunar South Pole landing! And congratulations to #India on being the 4th country to successfully soft-land a spacecraft on the Moon. We’re glad to be your partner on this mission! https://t.co/UJArS7gsTv

    — Bill Nelson (@SenBillNelson) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ, ఇస్రోకు పుతిన్​ అభినందనలు
Putin Wishes Modi : చంద్రయాన్​ 3 విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ సందేశం పంపించారు. అంతరిక్ష పరిశోధనలో ఈ విజయం కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు.

  • #Chandrayaan3 | Russian President Vladimir Putin sends a congratulatory message to President Droupadi Murmu and Prime Minister Narendra Modi congratulating India on the successful Moon landing of the Chandrayaan-3 mission, "Please, accept my heartfelt congratulations on the… pic.twitter.com/H3M7XE5rr4

    — ANI (@ANI) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నేపాల్ ప్రధాని సహా పలువురి విషెస్​
ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కుమార్ దహాల్​.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ రోజు అంతరిక్ష పరిశోధన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్​పీ సౌద్​ సైతం ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇది కేవలం కేవలం భారతదేశానికి మాత్రమే గర్వ కారణం కాదని.. అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఇది మానవులు మరింత ఉన్నతంగా జీవించేలా చేయడంలో సహాయం చేస్తోందని పేర్కొన్నారు. భారత ప్రజలకు ఇది ఎంతో చారిత్రక సంఘటన అని కొనియాడారు అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్​ సీఈఓ ముఖేశ్ అగి. మానవులకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి చేసే ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

  • I congratulate Prime Minister Shri Narendra Modi ji and ISRO team of India on successful landing of Chandrayan-3 in the surface of the moon today and unleashing of a historic achievement in science and space technology.

    — PMO Nepal (@PM_nepal_) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Heartiest congratulations to India 🇮🇳 for successful soft-landing of Chandrayaan-3 spacecraft on the moon!

    This is not only a moment of national pride for our Indian friends but also an important milestone in the advancement of space science and technology, which ultimately…

    — NP Saud (@NPSaudnc) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Landed on Moon : జయహో భారత్​.. చంద్రయాన్​ 3 సాఫ్ట్ ల్యాండింగ్​ సక్సెస్​

Chandrayaan 3 Landing Success Wishes : చంద్రయాన్-3 సక్సెస్​తో నా జీవితం ధన్యమైంది : ప్రధాని మోదీ

Last Updated : Aug 23, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.