ETV Bharat / international

Israel Hamas War Update : పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. మానవతా సాయం కొనసాగుతుందని హామీ

Israel Hamas War Update : భారత ప్రధాని నరేంద్రమోదీ పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలిపారు. మరోవైపు ఇరుపక్షాలు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

Israel Hamas War Update
Israel Hamas War Update
author img

By PTI

Published : Oct 19, 2023, 8:32 PM IST

Israel Hamas War Update : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్​తో గురువారం ఫోన్​లో మాట్లాడారు. మంగళవారం గాజాలోని అల్​-అహ్లి అరబ్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో పౌరుల మరణాల పట్ల సంతాపం తెలియజేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య పట్ల భారత్​ దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న తీవ్రవాహం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై మోదీ సంభాషించారు. పాలస్తీనా ప్రజలు కోసం భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని అబ్బాస్​కు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్​లో ట్వీట్ చేశారు.

  • Spoke to the President of the Palestinian Authority H.E. Mahmoud Abbas. Conveyed my condolences at the loss of civilian lives at the Al Ahli Hospital in Gaza. We will continue to send humanitarian assistance for the Palestinian people. Shared our deep concern at the terrorism,…

    — Narendra Modi (@narendramodi) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారతీయులను తరలించడం కష్టతరమే : అరిందమ్​ బాగ్చి
మరోవైపు, గాజా నుంచి భారతీయులను తీసుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరమని విదేశి వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏ చిన్న అవకాశం ఉన్నా వారిని భారత్‌కు తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు పాలస్తీనాలో నలుగురు భారతీయులు మాత్రమే ఉండగా.. అందులో ఒకరు వెస్ట్‌ బ్యాంక్‌లో ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరిగిన దాడుల్లో మరణించిన వారిలో భారతీయులు ఎవరూ లేరని ఆయన తెలిపారు.

Gaza Hospital Attack : గాజాలో జరుగుతు‌న్న ఉగ్రదాడులను బాగ్చి ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్‌ దానిని సహించదని పేర్కొన్నారు. ఇటీవల అక్కడి ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా సమస్యను ఇరు పక్షాలు చర్చించుకుని పరిష్కరించుకోవాలని బాగ్చి సూచించారు. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను ఇప్పటికే ఆపరేషన్‌ అజయ్‌ పేరిట స్వదేశానికి కేంద్రం తీసుకువస్తోంది.

గాజాలో వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి : కాంగ్రెస్
Congress On Palestine : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, ప్రజలకు మానవతా సహాయం అందిచాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం పిలుపునిచ్చారు. అల్​- అహ్లి ఆస్పత్రిపై జరిగిన దాడిని ఖండించారు. విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాలస్తీనా ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి, ఇజ్రాయెల్ భద్రతకు హామీ లభించడానికి ఇరువైపులా హింసను విడిచిపెట్టాలని, చర్చల ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. భయం, బెదిరింపుల వాతావరణంలో జీవిస్తున్న పాలస్తీనా ప్రజల హక్కులకే కాంగ్రెస్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. సొంత సార్వభౌమ రాజ్యంలో ఆత్మగౌరవం, సమానత్వంతో జీవించాలన్న వారి ఆకాంక్షలు చట్టబద్ధమైనదని ఖర్గే అన్నారు. అక్టోబర్ 8న ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ జరిపిన క్రూరమైన దాడులను కాంగ్రెస్ ఖండించిందని ఖర్గే తెలిపారు.

US Aid To Gaza : గాజాకు అమెరికా రూ.832కోట్ల సాయం.. 10లక్షల మంది ప్రజలకు అండగా..

Rishi Sunak Israel Visit : ఇజ్రాయెల్ పోరాటానికి బ్రిటన్ మద్దతు.. అండగా ఉంటామన్న రిషి.. అమెరికాకు యుద్ధం సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.