ETV Bharat / international

Israel Hamas War : 'రసాయన దాడులకు హమాస్ మాస్టర్​ ప్లాన్​.. మా వద్ద ఆధారాలున్నాయి'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 12:38 PM IST

Israel Hamas War : భారీ ఎత్తున విధ్వంసానికి సిద్ధమయ్యే ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులకు పాల్పడిందని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఆరోపించారు. చివరకు రసాయన ఆయుధాలను వాడేందుకు కూడా సిద్ధమైందన్నారు. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌ సాయుధుడి వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు లభించినట్లు ఆయన వెల్లడించారు.

Israel Hamas War
ఇజ్రాయెల్‌ హమాస్​ యుద్ధం

Israel Hamas War : ఇజ్రాయెల్‌లో రసాయన దాడులూ చేసేందుకు హమాస్‌ సిద్ధమైందని.. ఇజ్రాయెల్​ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమకు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై భారీ ఎత్తున విధ్వంసానికి సిద్ధమయ్యే.. హమాస్‌ ఈ దాడులను ప్రారంభించిందని ఐజాక్‌ ఆరోపించారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్‌ మిలిటెంట్ల వద్ద ఉన్నట్లు హెర్జోగ్‌ పేర్కొన్నారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్‌ ఖైదా నుంచి పొందినట్లు ఆయన ఆరోపించారు.

Israel Hamas War
ఇజ్రాయెల్‌- హమాస్​ యుద్ధం

తమ సైన్యం జరిపిన దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌ సాయుధుడి వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు ఐజాక్‌ వెల్లడించారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్‌ సెంటర్ల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకోవమో చేయాలని అందులో ఉన్నట్లు పేర్కొన్నారు. సాయుధుడి మృతదేహం వద్ద సైనైడ్‌ డిస్పర్షన్‌ డివైజ్‌ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికినట్లు తెలిపారు. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్‌ సభ్యుల దగ్గర లభించినట్లు ఐజాక్‌ తెలిపారు. మరోవైపు.. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్​ చేసిన వైమానిక దాడుల్లో వందల మంది మరణించినట్లు తెలుస్తోంది.

  • VIDEO | Hundreds feared dead in Israeli airstrikes on the Gaza strip within a span of 24 hours. Israel's military spokesman said that Tel Aviv is stepping up its attacks, and there are growing expectations of a ground offensive.

    (Source: EFE/PTI) pic.twitter.com/3dRSlrapR6

    — Press Trust of India (@PTI_News) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

VIDEO | Hundreds feared dead in Israeli airstrikes on the Gaza strip within a span of 24 hours. Israel's military spokesman said that Tel Aviv is stepping up its attacks, and there are growing expectations of a ground offensive.

(Source: EFE/PTI) pic.twitter.com/3dRSlrapR6

— Press Trust of India (@PTI_News) October 23, 2023

రెండు వారాల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో తమ పౌరులు, సైనికులు కలిపి దాదాపు 1,400 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మరో 212 మందిని బందీలుగా చేసుకున్నట్లు తెలిపింది. దీనికి ప్రతీకారంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ నియంత్రణలోని గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. గాజాపట్టీలో ప్రజలకు సురక్షిత ప్రాంతమన్నది లేకుండా పోయింది. ప్రతీరోజు వందలాది ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆహార కొరత కారణంగా గాజాలో ప్రజలు ఒకపూటే తిండి తింటున్నారు. మురుగు నీటినే తాగుతూ బతుకుతున్నారు. విదేశీ సాయం కోసం వేచి చూస్తున్నారు. వందలాది భవనాలు గాజాలో శిథిలాల గుట్టగా మారిపోయాయి. త్వరలో భూతల దాడులు ప్రారంభించేందుకూ సన్నద్ధమవుతుంది ఇజ్రాయెల్​.

Israel Hamas War
ఇజ్రాయెల్‌- హమాస్​ యుద్ధం

Israel Hamas War Effect On Jerusalem : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం.. యాత్రికులు లేక వెలవెలబోతున్న జెరూసలేం

Israel Vs Hamas War 2023 : ముష్కరులు నక్కిన మసీదుపై ఇజ్రాయెల్​ దాడులు.. యుద్ధంలోకి హెజ్​బొల్లా.. IDFకు గట్టి వార్నింగ్!

Israel Hamas War : ఇజ్రాయెల్‌లో రసాయన దాడులూ చేసేందుకు హమాస్‌ సిద్ధమైందని.. ఇజ్రాయెల్​ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమకు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై భారీ ఎత్తున విధ్వంసానికి సిద్ధమయ్యే.. హమాస్‌ ఈ దాడులను ప్రారంభించిందని ఐజాక్‌ ఆరోపించారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్‌ మిలిటెంట్ల వద్ద ఉన్నట్లు హెర్జోగ్‌ పేర్కొన్నారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్‌ ఖైదా నుంచి పొందినట్లు ఆయన ఆరోపించారు.

Israel Hamas War
ఇజ్రాయెల్‌- హమాస్​ యుద్ధం

తమ సైన్యం జరిపిన దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌ సాయుధుడి వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు ఐజాక్‌ వెల్లడించారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్‌ సెంటర్ల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకోవమో చేయాలని అందులో ఉన్నట్లు పేర్కొన్నారు. సాయుధుడి మృతదేహం వద్ద సైనైడ్‌ డిస్పర్షన్‌ డివైజ్‌ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికినట్లు తెలిపారు. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్‌ సభ్యుల దగ్గర లభించినట్లు ఐజాక్‌ తెలిపారు. మరోవైపు.. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్​ చేసిన వైమానిక దాడుల్లో వందల మంది మరణించినట్లు తెలుస్తోంది.

  • VIDEO | Hundreds feared dead in Israeli airstrikes on the Gaza strip within a span of 24 hours. Israel's military spokesman said that Tel Aviv is stepping up its attacks, and there are growing expectations of a ground offensive.

    (Source: EFE/PTI) pic.twitter.com/3dRSlrapR6

    — Press Trust of India (@PTI_News) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెండు వారాల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో తమ పౌరులు, సైనికులు కలిపి దాదాపు 1,400 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మరో 212 మందిని బందీలుగా చేసుకున్నట్లు తెలిపింది. దీనికి ప్రతీకారంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ నియంత్రణలోని గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. గాజాపట్టీలో ప్రజలకు సురక్షిత ప్రాంతమన్నది లేకుండా పోయింది. ప్రతీరోజు వందలాది ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆహార కొరత కారణంగా గాజాలో ప్రజలు ఒకపూటే తిండి తింటున్నారు. మురుగు నీటినే తాగుతూ బతుకుతున్నారు. విదేశీ సాయం కోసం వేచి చూస్తున్నారు. వందలాది భవనాలు గాజాలో శిథిలాల గుట్టగా మారిపోయాయి. త్వరలో భూతల దాడులు ప్రారంభించేందుకూ సన్నద్ధమవుతుంది ఇజ్రాయెల్​.

Israel Hamas War
ఇజ్రాయెల్‌- హమాస్​ యుద్ధం

Israel Hamas War Effect On Jerusalem : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం.. యాత్రికులు లేక వెలవెలబోతున్న జెరూసలేం

Israel Vs Hamas War 2023 : ముష్కరులు నక్కిన మసీదుపై ఇజ్రాయెల్​ దాడులు.. యుద్ధంలోకి హెజ్​బొల్లా.. IDFకు గట్టి వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.