ETV Bharat / international

8 నెలల పాప, తల్లిదండ్రులు కిడ్నాప్.. కాలిఫోర్నియా పోలీసులు హైఅలర్ట్ - california abduction

కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన నలుగురు కిడ్నాప్​నకు గురయ్యారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు.

california kidnap
4 Indian origin people abducted in California
author img

By

Published : Oct 4, 2022, 11:01 AM IST

అమెరికా కాలిఫోర్నియాలోని మెర్సిడ్​లో భారత సంతతికి చెందిన నలుగురు అపహరణకు గురయ్యారు. ఇందులో ఓ 8 నెలల పసికందు, ఆ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. కిడ్నాప్​కు గురైనవారిలో తండ్రి జస్దీప్​ సింగ్​, తల్లి జస్లీన్​ కౌర్, కూతురు​ ఆరూహీ ధేరీతో పాటు అమన్​దీప్​ సింగ్​ అనే వ్యక్తి ఉన్నారు. నిందితులను ప్రమాదకరమైన వ్యక్తులుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్​ జరిగిన ప్రదేశం అనేక రెస్టారెంట్లు, దుకాణాలతో రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని తెలిపారు. అనుమానితులు లేదా బాధితులు కనిపిస్తే వారి వద్దకు వెళ్లకుండా అత్యవసర నెంబర్​కు కాల్​ చేసి సమాచారం అందించాలని కోరారు.
2019లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన తుషార్ ఆత్రే అనే వ్యక్తి కిడ్నాప్​నకు గురయ్యాడు. అతడ్ని ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత తన గర్లఫ్రెండ్​ కారులో విగతజీవిగా కనిపించాడు.

ఇదీ చదవండి: రష్యాకు 'సైనిక సమీకరణ' కష్టాలు.. వేలాది మంది వెనక్కి.. కారణమదే!

హిజాబ్ ఆందోళనలకు కారణం ఆ రెండు దేశాలే.. మౌనం వీడిన ఇరాన్ సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.