Indians Died In Nepal Road Accident : నేపాల్‌లో ఓ బస్సు బోల్తా పడి భారత్‌కు చెందిన ఆరుగురు యాత్రికులతో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. దక్షిణ నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాఠ్‌మాండూ నుంచి జానక్పుర్కు వెళ్తున్న బస్సు.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు బోల్తాపడిండి. అనంతరం రోడ్డు నుంచి 50 మీటర్ల కిందకు పడిపోయింది. సిమారా సబ్-మెట్రోపాలిటన్ సిటీలోని చురియమై ప్రాంత సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల్లో భారతీయులతో పాటు ఓ నేపాలీ కూడా ఉన్నాడు. ఘటనలో డ్రైవర్, సహాయక డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారందరూ.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను రాజస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
హైవేపై నుంచి లోయలో పడ్డ బస్సు.. చిన్నారులు సహా 17 మంది మృతి..
Mexico Bus Accident : మూడు వారాల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి లోయలోకి పడిపోయింది. మెక్సికోలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లోయలో పడ్డ గంగోత్రి యాత్రికుల బస్సు.. ఎనిమిది మృతి..
Bus Accident in Uttarakhand Today : నాలుగు రోజుల క్రితం ఉత్తరాఖండ్ గంగోత్రిలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రి రహదారిపై గన్గ్నానీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 35 మంది భక్తులు ఉన్నారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారిగా పోలిసులు గుర్తించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రష్యా కిరాయి సైన్యం అధినేత ప్రిగోజిన్ దుర్మరణం.. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన 2నెలలకే..