ETV Bharat / international

తీరం చేరిన టైటాన్​ సబ్​మెరైన్ శకలాలు.. మానవ అవశేషాలు లభించే ఛాన్స్​! - పేలిపోయిన టైటాన్​ సబ్​మెరైన్​

Titan Submersible Debris : అట్లాంటిక్​ మహాసముద్రంలో పేలిపోయిన టైటాన్​ జలాంతర్గామి శకలాలు తీరం చేరాయి. ఆ శకలాల్లో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని అమెరికా కోస్ట్​గార్డ్​ ఓ ప్రకటనలో తెలిపింది.

Titan Submersible Remains
Titan Submersible Remains
author img

By

Published : Jun 29, 2023, 9:42 AM IST

Updated : Jun 29, 2023, 10:12 AM IST

Titan Submersible Remains : అట్లాంటిక్‌ మహాసముద్రంలో పేలిపోయిన టైటాన్‌ జలాంతర్గామి శకలాలు తీరాన్ని చేరాయి. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ అండ్‌ లాబ్రడార్‌ ప్రావిన్సులోని సెయింట్‌ జాన్స్‌ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చారు. అయితే, అందులో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని యూఎస్​ కోస్ట్​గార్డ్​ బుధవారం తెలిపింది. జలాంతర్గామి పేలిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇదో కీలక పరిణామం.
'టైటాన్ జలాంతర్గామి పేలిపోవడానికి దారితీసిన అంశాలను అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇలాంటి విషాదం మళ్లీ జరగకుండా చూసుకోవడంలో అది సహాయం చేస్తుంది' అని కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ తెలిపారు.

Titan Submersible Missing : జలాంతర్గామి శకలాలను వెతకడానికి పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ సంస్థ హారిజాన్​ ఆర్కిటక్ అనే నౌకను రంగంలోకి దింపింది. అందులో ఉన్న రిమోట్ ఆపరేటెడ్​ వాహనం (ఆర్​ఓవీ) ద్వారా జలాంతర్గామి శకలాల ఆచూకీని గత వారం గుర్తించారు. ఆఫ్​షోర్​ గాలింపు కార్యకలాపాలను బుధవారం పూర్తి చేసినట్లు పెలాజిక్​ రీసెర్చ్​ తెలిపింది. అయితే, తమ రీసెర్చ్​ బృందం ఇంకా మిషన్​లోనే ఉందని.. కెనడా, అమెరికా దర్యాప్తు సంస్థలు దర్యాప్తులో భాగం అయినందున ఎక్కువ వివరాలు వెల్లడించలేనని పెలాజిక్​ రీసెర్చ్​ ప్రతినిధి జెఫ్​ మహూనీ తెలిపారు. 'తమ బృందం శారీరక, మానసిక సవాళ్ల అధిగమించి మిషన్​ను పూర్తి చేయడానికి 10 రోజుల నుంచి నిరంతరాయంగా కష్టపడుతున్నారు' అని మహూనీ చెప్పారు.
లభ్యమైన శకలాలను విశ్లేసిస్తే..టైటాన్​కు జలాంతర్గామికి ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి క్లూస్​ లభిస్తాయని వూడ్స్​ హోల్​ ఓషియనోగ్రాఫిక్​ ఇన్​స్టిట్యూషన్​కు చెందిన కార్ల్​ హార్ట్స్​ ఫీల్డ్​ తెలిపారు. దాంతో పాటు ఎలక్ట్రానిక్​ డేటా కూడా లభ్యమయ్యే అవకాశముందని చెప్పారు.

Titan Submersible Remains
తీరం చేరిన టైటాన్​ జలాంతర్గామి శకలాలు

Titanic Submarine Passengers : అట్లాంటిక్‌ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్​ నౌక శకలాలను చూసేందుకు.. ఐదుగురు పర్యటకులతో న్యూఫౌండ్​ల్యాండ్​ నుంచి టైటాన్​ మీనీ సబ్​మెరైన్​ వెళ్లి గల్లంతైంది. అందులో పాకిస్థాన్‌కు చెందిన బిలియనీర్‌ షెహజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19), యూఏఈలో ఉంటున్న బ్రిటన్ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఫ్రెంచ్‌ మాజీ నేవీ అధికారి పాల్‌ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ ఉన్నారు. దీంతో కెనడా, అమెరికా కోస్ట్​గార్డ్​ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. గల్లంతైన మినీ జలాంతర్గామి 'టైటాన్‌'.. తీవ్రమైన ఒత్తిడి పెరగడం వల్ల పేలిపోయిందని జూన్​ 22న అమెరికా కోస్ట్​ గార్డ్​ తెలిపింది. అందులో ఉన్న ఐదుగురు పర్యటకులు మరణించారని వెల్లడించింది.

Last Updated : Jun 29, 2023, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.