ETV Bharat / international

భారతీయులకు గుడ్​న్యూస్​.. ఇక మరింత ఈజీగా గ్రీన్​ కార్డ్.. సెనేట్​లో బిల్! - green card holder

Green Card Bill In Senate : అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. గ్రీన్​కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు డెమొక్రటిక్ చట్ట సభ్యులు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు భారీ ఊరట లభించనుంది.

green card bill in senate
గ్రీన్​కార్డు
author img

By

Published : Sep 29, 2022, 2:00 PM IST

Updated : Sep 29, 2022, 2:35 PM IST

Green Card Bill In Senate : గ్రీన్​కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు. ఈ బిల్లును సెనేటర్ అలెక్స్ పాడిల్లా సభలో ప్రవేశపెట్టగా.. ఎలిజిబెత్​ వారెన్​, బెన్​ రే లుజన్​, విప్ డిక్ డర్బిన్ అనే సెనేటర్​లు బలపరిచారు. ఈ బిల్లు వల్ల వలసదారులకు అపార ప్రయోజనం చేకూరనుంది.

వలసదారులు కనీసం ఏడు సంవత్సరాలు అమెరికాలో నివసిస్తే.. గ్రీన్‌కార్డు జారీ చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. వలసదారులు ఏడు సంవత్సరాలు తర్వాత శాశ్వతంగా యూఎస్​లో నివసించేందుకు గ్రీన్​కార్డు లభిస్తుంది. గ్రీన్​కార్డు బిల్లు అమలైతే ముఖ్యంగా భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులకు అపార ప్రయోజనం ఉంటుంది.

"పాత ఇమిగ్రేషన్ విధానం ద్వారా మిలియన్ల మంది వలసదారులు నష్టపోయారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఈ బిల్లు ద్వారా 8 మిలియన్ల వలసదారులకు ఊరట లభించనుంది. కొంతమంది వలసదారులు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్నారు. దేశం కోసం పనిచేస్తున్నారు. దేశ అభివృద్ధిలో సహకరిస్తున్నారు. అలాంటి వారికి స్వేచ్ఛగా యూఎస్​లో జీవించడానికి అనుమతించే హక్కును కల్పించేందుకే గ్రీన్​కార్డు బిల్లును ప్రవేశపెట్టాం."

-- అలెక్స్ పాడిల్లా, సెనేటర్​

గ్రీన్ కార్డు ఉన్నవారు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండవచ్చు. హెచ్‌ 1బీ వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ జనాభా కలిగిన భారత్‌, చైనా వలసదారులు ఈ నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా గ్రీన్​కార్డుకు సంబంధించిన బిల్లుతో వలసదారుల కష్టాలు తీరనున్నాయి.

ఇవీ చదవండి: వణికించిన అయాన్.. 10లక్షల ఇళ్లకు కరెంట్ కట్.. 23 మంది గల్లంతు

విలీనంపై పుతిన్​ త్వరలో ప్రకటన.. తర్వాత విధ్వంసమేనా?

Last Updated : Sep 29, 2022, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.