ETV Bharat / international

చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు.. - రష్యా ఉక్రెయిన్ యుద్ధం

జర్మనీ హాంబర్గ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. చర్చిపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు.

germany shooting attack
germany shooting attack
author img

By

Published : Mar 10, 2023, 7:42 AM IST

Updated : Mar 10, 2023, 8:55 AM IST

జర్మనీ హాంబర్గ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. చర్చిపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9:15 సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

చర్చిలో కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హాటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన నిందితుడు తప్పించుకుని బయటకు వెళ్లినట్లు ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో కాల్పులు జరిపిన నిందితుడు చర్చిలోపలే ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. చర్చిలోపల ఉన్న వ్యక్తే ఈ కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. బయట వ్యక్తులకు ప్రమేయం ఇందులో లేదని అధికారులు తెల్చారు. ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న కొందరు వ్యక్తులు దాదాపు 25 సార్లు కాల్పుల జరిగిన శబ్దం విన్నట్లు చెబుతున్నారు. మరి కొందరు ఈ కాల్పులు జరిగిన తర్వాత ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్​ నుంచి రెండో అంతస్తుకు వెళ్లినట్లు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ న్యాయ విద్యార్థిని కేవలం 20 సెకండ్ల వ్యవధిలోనే నాలుగు సార్లు కాల్పులు విన్నట్లు పోలీసులకు చెప్పింది. అయితే ఈ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారనే దానికి అప్పుడే స్పష్టంగా చెప్పలేమని పోలీసు ప్రతినిధి హోల్గర్ వెహ్రాన్​ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందిచిన హాంబర్గ్​ మేయర్ బాధితుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాల్పులు జరిగిన ఈ చర్చి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దీన్ని 19వ దశాబ్దంలో స్థాపించారు. ప్రస్తుతం ఈ చర్చిలో 1,70,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు.

పాలస్తీనాలో సాయుధుడి కాల్చివేత
పాలస్తీనాలో రద్దీగా ఉండే సెంట్రల్​ అవివ్​ వీధిలో కాల్పులకు తెగబడ్డాడు ఓ సాయుధుడు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సాయుధుడిని కాల్చి చంపారు. గాయపడిన ముగ్గురులో ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉక్రెయిన్​పై విరుచుకుపడిన రష్యా..
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై గురువారం క్షిపణుల వర్షం కురిపించింది. కీలక మౌలిక సదుపాయాలు, నివాస భవనాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. కీవ్‌తో పాటు, ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్ , నల్ల సముద్రం తీరంలోని నౌకా నగరం ఒడెసా, పాల్తొవా, లవీవ్, జపొరిజియా, నిప్రో తదితర నగరాలను మాస్కో లక్ష్యంగా చేసుకుంది. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసింది. 81 క్షిపణులను 8 షాహిద్ డ్రోన్లను రష్యా ప్రయోగించిందని అందులో 34 క్షిపణులను తాము కూల్చామని కీవ్ రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. వరుస క్షిపణి దాడులు, జపోరీజియా అణువిద్యుత్ కేంద్రానికి తీవ్ర నష్టం కలిగించాయి. కేంద్రానికి విద్యుత్ అందిస్తున్న ఏకైక 750 కిలోవాట్ల లైన్‌కు తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో కొంతసేపు డీజిల్ జనరేటర్లతోనే అణు రియాక్టర్లను నడిపారు.

Last Updated : Mar 10, 2023, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.