ETV Bharat / international

ఆ పాస్​పోర్ట్ ఉంటే గాజాను వీడొచ్చు! ఈజిప్టులోకి ప్రవేశానికి అనుమతి

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 4:58 PM IST

Gaza Egypt Border Open : ఇజ్రాయెల్‌ భీకర దాడులతో మూడు వారాలుగా మరుభూమిని తలపిస్తున్న గాజా నుంచి ఎట్టకేలకు కొందరు బయటపడ్డారు. విదేశీ పాస్​పోర్టులు కలిగిన ఉన్నవారు, తీవ్ర గాయాలపాలైన వారు గాజాను వీడి తమ దేశం వచ్చేందుకు ఈజిప్టు అంగీకరించింది. ఇన్నిరోజులు పిచ్చుక కూడా గాజాను వీడి వెళ్లలేని పరిస్థితుల నడుమ ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం.. వారికి ఉపశమనం కలిగించింది. తీవ్రంగా గాయపడ్డవారికి తమ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తామని ఈజిప్టు తెలిపింది.

Gaza Egypt Border Open
Gaza Egypt Border Open

Gaza Egypt Border Open : గాజా స్ట్రిప్‌లో విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు, తీవ్రంగా గాయపడ్డవారికి ఉపశమనం కలిగింది. గాజా స్ట్రిప్‌ నుంచి ఈజిప్టునకు వెళ్లే కీలక రఫా క్రాసింగ్‌.. వీరి కోసం తెరుచుకుంది. ఇందుకు ఈజిప్టు, హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య అమెరికా మద్దతుతో ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది.

క్షతగాత్రులను తరలించేందుకు అంగీకరించిన ఈజిప్టు..
విదేశీ పాస్‌పోర్టుదారులే కాక తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను కూడా తరలించేందుకు గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్‌తో పాటు ఈజిప్టు కూడా అంగీకరించింది. వారికి తమ దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు అంగీకరించింది. తమ దేశం నుంచి గాజా లోపలికి అంబులెన్సులను పంపించి.. తీవ్రంగా గాయపడ్డవారిని తీసుకెళుతోంది ఈజిప్టు. ఇప్పటి వరకు 88 మందిని అంబులెన్సులలో ఈజిప్టుకు తీసుకెళ్లింది.

Gaza Egypt Border Open
ఈజిప్టు-గాజా సరిహద్దు
Gaza Egypt Border Open
ఈజిప్టు-గాజా సరిహద్దు

ఈ ఒప్పందం ఎన్నిరోజులు అమలులో ఉంటుందో ఏ దేశం కూడా వెల్లడించలేదు. అలాగే.. ఒప్పందం కుదరడానికి అటు హమాస్‌ గానీ ఇటు.. ఇజ్రాయెల్‌ గానీ ఎలాంటి షరతులు విధించలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం 500 మంది విదేశీ పాస్‌పోర్టుదారులను గాజా వీడి ఈజిప్టు వచ్చేందుకు అనుమతించారు. గాజా జనాభా 23 లక్షలుకాగా వీరిలో ఎంతమందికి విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయో అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు.

Gaza Egypt Border Open
ఈజిప్టు-గాజా సరిహద్దు

మధ్యవర్తిత్వం వహించిన ఖతార్​..
Hamas Hostages Recovered : మరోవైపు హమాస్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ దగ్గర ఉన్న 200 దాకా బందీల్లో ఇజ్రాయెల్‌ కాకుండా ఇతర దేశాలకు చెందిన వారిని విడుదల చేస్తామని హమాస్‌ ప్రకటించింది. ఈ మేరకు హమాస్‌ పోరాట విభాగం.. ప్రతినిధి అల్‌ ఖస్సామ్‌ తెలిపారు. దీనికి కూడా ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం.

Gaza Egypt Border Open
ఈజిప్టు-గాజా సరిహద్దు

రఫా సరిహద్దు కీలకం..
Rafah Border Crossing Gaza : యుద్ధం ప్రారంభమైన తర్వాత రఫా సరిహద్దు చాలా కీలకంగా మారింది. గాజాలోకి మానవతా సాయం అందించేందుకు ఈ క్రాసింగ్‌ అత్యంత కీలకం. అయితే చాలా రోజులు ఇజ్రాయెల్‌ అంగీకరించకపోవడం వల్ల మానవతా సాయంతో నిండిన ట్రక్కులు ఈజిప్టులోనే నిలిచిపోయాయి. తర్వాత వివిధ దేశాల జోక్యంతో మానవతాసాయాన్ని రఫా గుండా గాజాలోకి ఇజ్రాయెల్‌ అనుమతించింది.

Gaza Egypt Border Open
గాజా నుంచి ఈజిప్టులోకి వెళ్తున్న మహిళలు, చిన్నారులు
Gaza Egypt Border Open
గాజా సరిహద్దు దాటుతున్న పౌరులు

గాజాలో హమాస్‌ పాలన అంతమైతే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్‌ పరిపాలన సాగిస్తుందా? అమెరికా ప్లాన్ అదేనట!

Israel Ground Operation : గాజాలో భీకర భూతల దాడులు.. 600స్థావరాలు ధ్యంసం.. సొరంగాల్లో ఉన్నవారిని కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.