పన్నుల పెంపును నిరసిస్తూ ఫ్రాన్స్ ప్రజలు చేపడుతోన్న ఎల్లోవెస్ట్ ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చింది. నిరసనకారుల డిమాండ్ల మేరకు పన్నులు తగ్గిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఐదు నెలల పాటు సాగిన నిరసనలను అరికట్టడానికి దీర్ఘకాల ప్రణాళికలను ఆవిష్కరించారు.
పార్లమెంట్లో చట్టసభ సభ్యుల సంఖ్యను తగ్గిస్తామని ప్రకటించారు మేక్రాన్. ఫ్రెంచ్ రాజకీయాల్లో మరింత పారదర్శకతను పెంచే దిశగా పార్లమెంటరీ ఓటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామన్నారు .
" నేడు, అన్నిటికంటే ముందుగా అనివార్యంగా శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. కానీ ప్రజల మద్దతుతో ఆందోళనకారుల గుండెల్లోంచి వచ్చిన డిమాండ్లు మరుగున పడే విధంగా నేను ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకోవట్లేదు.
ఆర్థిక న్యాయానికి ధనవంతులపై పన్నులు పెంచడం ఉత్తమైన పరిష్కారం కాదని నేను అనుకుంటున్నాను. అందుకు బదులుగా ఎక్కవ మంది ప్రజలపై ఉన్న పన్ను తగ్గిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గతకొన్ని దశాబ్దాల నుంచి ఆదాయ పన్ను కడుతున్న మధ్య తరగతి ప్రజలపై ఉన్న పన్నులు తగ్గించాలి. అందుకే వారిపై పన్నులు పెంచాలనుకోవట్లేదు. ఉద్యోగుల ఆదాయపన్ను కూడా కొంతమేర తగ్గించాలనుకుంటున్నాను."
- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: ఒకే రాష్ట్రంలో నేడు మోదీ, రాహుల్ ప్రచారం