France Plane Reached Mumbai : మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లో నిలిపివేసిన 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానం ఎట్టకేలకు ముంబయి చేరుకుంది. మంగళవారం ఉదయం వీరంతా ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. కాగా, వీరిందరిని సీఐఎస్ఎఫ్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. మిగతావారిని ప్రశ్నిస్తున్నారు.
అంతకుముందు భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి ఇండియాకు బయల్దేరింది విమానం. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబాయి నుంచి పారిస్ మీదుగా నికరాగువాకు చేరుకోవాల్సి ఉంది. కాని, దీనిని భారత్‌కు మళ్లించారు. వాస్తవానికి సోమవారం ఉదయమే ఈ విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే విమానంలోని కొందరు ప్రయాణికులు భారత్‌కు వచ్చేందుకు సుముఖత చూపకపోవడం వల్ల కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం తలెత్తినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
-
#WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today
— ANI (@ANI) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx
">#WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today
— ANI (@ANI) December 26, 2023
(Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx#WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today
— ANI (@ANI) December 26, 2023
(Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx
విమానాన్ని ఎందుకు ఆపారంటే?
303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం దుబాయి నుంచి నికరాగువాకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఇంధనం కోసం విమానాన్ని పారిస్ సమీపంలోని వాట్రీ విమానాశ్రయంలో ఆపారు. అయితే.. మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న అనుమానంతో స్థానిక అధికారులు ఆ విమానాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఫలితంగా నాలుగు రోజుల పాటు విమానం ఫ్రాన్స్‌లోనే చిక్కుకుపోయింది. ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సంబంధిత అధికారులతో చర్చించింది. ఈ వ్యవహారంపై ఆదివారం కోర్టులో విచారణ జరిగింది. చివరకు విమానం బయలుదేరేందుకు అన్ని అనుమతులు వచ్చాయి.
-
#WATCH | Maharashtra: Passengers leave from Mumbai airport.
— ANI (@ANI) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today. pic.twitter.com/N93wPcbwr8
">#WATCH | Maharashtra: Passengers leave from Mumbai airport.
— ANI (@ANI) December 26, 2023
A plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today. pic.twitter.com/N93wPcbwr8#WATCH | Maharashtra: Passengers leave from Mumbai airport.
— ANI (@ANI) December 26, 2023
A plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today. pic.twitter.com/N93wPcbwr8
11 మంది వారే- ఆ ఇద్దరు అక్కడే
విమానంలో చిక్కుకున్న వారిలో 11 మంది ఏ తోడూ లేని మైనర్లేనని అధికారులు తెలిపారు. అయితే కొంతమంది ఫ్రాన్స్‌లోనే ఆశ్రయం పొందేందుకు అనుమతించాలని అధికారులను కోరారు. మరోవైపు ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇక భారతీయులతో పాటు మిగతా దేశస్థులు ఉన్న ఈ విమానంలో మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఫ్రాన్స్ అదుపులో 300మంది భారతీయులు! ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే?
భారతీయుల విమానానికి లైన్‌క్లియర్- ఎయిర్‌పోర్ట్‌లోనే విచారణ, ఇండియాకు వస్తుందా?