ETV Bharat / international

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఖాయం!

విదేశీ కానుకల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్​ అరెస్ట్​కు రంగం సిద్ధమైంది. లాహోర్​లో ఉన్న ఆయన ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు.

pakistan pm arrest
pakistan pm arrest
author img

By

Published : Mar 14, 2023, 7:00 PM IST

Updated : Mar 14, 2023, 7:52 PM IST

విదేశీ కానుకల కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. లాహోర్‌లోని ఆయన నివాసానికి మంగళవారం భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. దీంతో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌( పీటీఐ) కార్యకర్తలు ఇమ్రాన్ నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇమ్రాన్ ఖాన్​ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు, పీటీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఇంటి వెలుపల గుమిగూడిన ఆయన మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఇమ్రాన్ నివాసానికి వచ్చే అన్ని మార్గాల్లో కంటెయినర్లను ఏర్పాటు చేయడం సహా సైనిక బలగాలను మోహరించారు. నకిలీ కేసుల్లో తమ నాయకుడు పోలీసులకు లొంగిపోరని పీటీఐ నేతలు చెబుతున్నారు.

మహిళా జడ్జిని బెదిరించారనే కేసులో జారీ అయిన నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఫిబ్రవరి 16వ తేదీ వరకు సస్పెండ్‌ చేసిందన్న పీటీఐ కార్యకర్తలు.. ఇప్పుడు పోలీసులు ఎలాంటి వారెంట్ తెచ్చారో చూద్దామన్నారు. విదేశీ కానుకల కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు తమ బృందం ఆయన నివాసానికి వెళ్లినట్లు ఇస్లామాబాద్‌కు చెందిన సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన ఇటీవల జరిగిన విచారణకు ఇమ్రాన్‌ హాజరుకాకపోవడం వల్ల న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.

అయితే గతేడాది నుంచి పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థలతోపాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ప్రభుత్వాన్ని నడపలేక ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించడం వంటి చర్యలకు ఉపక్రమిస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పాకిస్థాన్​లో భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధర రూ.272కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.280కు ఎగబాకింది. అలాగే.. అమెరికాలోని పాకిస్థాన్‌ ఎంబసీలో ఉన్న ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది. వాషింగ్టన్‌లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది.

పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) గతేడాది ఏప్రిల్​లో బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది.

Last Updated : Mar 14, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.