ETV Bharat / international

Fire Accident In France : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది దివ్యాంగులు మృతి

author img

By

Published : Aug 9, 2023, 5:16 PM IST

Updated : Aug 9, 2023, 7:19 PM IST

Fire Accident In France : ఫ్రాన్స్​లోని ఓ దివ్యాంగుల వసతి గృహంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 11 మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Fire Accident In France
ఫ్రాన్స్​లో అగ్ని ప్రమాదం

Fire Accident In France : తూర్పు ఫ్రాన్స్​లోని దివ్యాంగుల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది వృద్ధ దివ్యాంగులు, మరో వ్యక్తి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.

ఇదీ జరిగింది..
ఫ్రాన్స్​ వింట్​జెన్​హీమ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దివ్యాంగుల వసతి గృహంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికార యంత్రాగం.. నాలుగు అగ్నిమాపక యంత్రాలు, 76 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేసింది. ప్రమాదంలో గాయపడిన 17 మందిని రెస్క్యూ టీమ్​ ఆసుపత్రికి తరలించింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్థానిక అధికారి క్రిస్టోఫ్​ మారొట్ మీడియాతో మాట్లాడుతూ.. "ఈ దివ్యాంగుల బృందం తూర్పు ఫ్రాన్స్​లోని నాన్సీ పట్టణంలో ఉంటుంది. వీరు వింట్​జెన్​హీమ్​లోని దివ్యాంగుల వసతి గృహానికి వెకేషన్​ కోసం వచ్చారు. మృతుల్లో వైకల్యం ఉన్న వృద్ధులు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఘటన స్థలంలో నాలుగు అంబులెన్స్​లు, 40 మంది పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశాం" అని అన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్.. "ప్రమాదంలో మరిణించిన వారికి సంతాపం తెలుపుతున్నా. విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ చేపట్టిన మా భద్రతా బలగాలకు ధన్యవాదాలు" అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ప్రమాదం గురించి తెలుసుకున్న ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసాబెత్ బోర్నీ.. ఈ ఘటన విషాదకరమన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఘటన స్థలాన్ని సందర్శించనున్నట్లు ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

  • Suite au terrible incendie qui a eu lieu à Wintzenheim cette nuit, je me rends sur place avec @auroreberge

    Mes premières pensées vont vers les victimes et leurs proches. Je salue la mobilisation des sapeurs-pompiers.

    — Élisabeth BORNE (@Elisabeth_Borne) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెస్టారెంట్​లో గ్యాస్ పేలుడు.. 31 మంది మృతి
China Gas Explosion Restaurant : ఇటీవలె చైనా ఇంచువాన్ నగరంలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మర్నాడు ఉదయం చైనా ప్రభుత్వ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ స్పందించింది. రెస్టారెంట్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. ఘటనపై దర్యాప్తు చేపట్టింది.

అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం

బార్బెక్యూ రెస్టారెంట్​లో గ్యాస్ పేలుడు!.. 31 మంది దుర్మరణం

Last Updated : Aug 9, 2023, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.