ETV Bharat / international

మరో వివాదంలో ఆ దేశ ప్రధాని, డ్రగ్స్​ సేవించి డ్యాన్స్​ చేశారంటూ - ఫిన్లాండ్ ప్రధాని డ్యాన్స్​ వీడియో

Sanna Marin Party Video ఫిన్లాండ్​ ప్రధాని సనా మారిన్​ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫ్రెండ్స్​తో కలిసి ఆమె డ్యాన్స్​ చేస్తున్న ఓ వీడియో వైరల్​గా మారింది. అయితే ఆమె డ్రగ్స్​ తీసుకుని ఉండొచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Sanna Marin Party Video
Sanna Marin Party Video
author img

By

Published : Aug 19, 2022, 8:11 AM IST

Sanna Marin Party Video: ఫిన్లాండ్‌ ప్రధానమంత్రి సనా మారిన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా నృత్యాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రతిపక్షాలు.. ఆమె డ్రగ్స్‌ తీసుకొని ఉండొచ్చని ఆరోపిస్తున్నాయి. దీంతో స్పందించిన ప్రధాని.. తాను ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం మిత్రులతో ప్రైవేట్‌ పార్టీ సందర్భంగా ఆనందంతో నృత్యాలు చేసినట్టు వివరణ ఇచ్చారు.

ప్రధానమంత్రి సనా మారిన్​తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్స్‌లు చేస్తోన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్లపై కూర్చొని సనా మారిన్‌ ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్‌ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెకు డ్రగ్‌ టెస్టు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా తనపై వచ్చిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. ఆ వీడియో లీక్‌ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదన్నారు.

  • COKE SNORTING Finnish PM 🇫🇮 – LEAKED VIDEO of Sanna Marin partying with friends discussing cocaine. She's taking after her fellow WEF Nazi coke-lover Z€£€N$K¥ pic.twitter.com/e45jr543OL

    — TXT World 🚛🚜🍊 (@txtworld) August 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సందర్భంగా డ్యాన్సులు, పాటలు పాడటం వాస్తవమే. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్‌ కావడం దురదృష్టకరం. కేవలం ఆల్కహాల్‌ తప్ప ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే. ఎలాంటి తప్పూ చేయలేదు" అంటూ వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి: భారత్​పై చైనా మరో ఎత్తుగడ, పక్కలో బల్లెంలా కుట్రలు, ఉపగ్రహ డేటాపై కన్ను

10 మంది పిల్లల్ని కంటే నజరానా, మహిళలకు పుతిన్ బంపర్ ఆఫర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.