ETV Bharat / international

మూడు దేశాల్లో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేల్​పై 6.1 తీవ్రత

Earthquake in pakistan today: పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, మలేషియాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. పాక్​, అఫ్గాన్​లలో 6.1గా.. మలేషియాలో 5.61గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

earthquake in pakistan today
earthquake in pakistan today
author img

By

Published : Jun 22, 2022, 7:04 AM IST

Earthquake in pakistan today: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​లో బుధవారం​ తీవ్ర భూకంపం సంభవించింది. పాక్​లో భూకంప తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.1 గా నమోదైంది. తెల్లవారుజామున 2:24 గంటలకు సంభవించినట్లు అమెరికా జియెలాజికల్​ సర్వే వెల్లడించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లమాబాద్​ సహా, అఫ్గానిస్థాన్​లోని ఖోస్ట్​ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మీడియా పేర్కొంది.

పాకిస్థాన్​తో పాటు మలేషియా కౌలాలంపుర్​కు 561 కిలోమీటర్ల పశ్చిమాన భూమి కంపించింది. అర్ధరాత్రి 12:38 గంటలకు 5.61 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సెస్మోలాజి తెలపింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయాందంళోనలకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు పెట్టారు. గత శుక్రవారం పాకిస్థాన్​లోని ఇస్లమబాద్​, పెషావర్​, రావల్పిండి, ముల్తాన్​ నగరాల్లో 5.0 తీవ్రతతో భూమి కంపించింది.

ఇదీ చదవండి: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.