ETV Bharat / international

ఈక్వెడార్​, పెరూలో భారీ భూకంపం.. 14 మంది మృతి.. - పాకిస్థాన్​ వరదలు

ఈక్వెడార్​, పెరూ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా.. 126 మంది గాయలపాలయ్యారు. రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ భూకంపం దాటికి చాలా ఇళ్లు, అధికార భవనాలు నెేలమట్టమయ్యాయి.

earthquake in ecuador 2023
earthquake in ecuador 2023
author img

By

Published : Mar 19, 2023, 10:01 AM IST

ఈక్వెడార్, పెరూ దేశాల్లో​ భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. 126 మంది గాయపాలైనట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో పెద్ద పెద్ద భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, వైద్య కేంద్రాలు పగుళ్లు ఏర్పడి వాటికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ విపత్తు కారణంగా ఈక్వెడార్​లో 13 మంది మరణించగా.. పెరూలో ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 126 మందికిపైగా గాయలపాలయ్యారని తెలిపారు. యూఎస్​ జియోలాజికల్​ సర్వే ఈక్వెడార్​లోని రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్​కు 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న పసిఫిక్​ తీరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో దీనిపై స్పందిస్తూ.. ప్రజలు ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

strong earthquake in ecuador
భూకంపం ధాటికి కూలిన ఇల్లు

ఈ భూకంపం ధాటికి పలు ఇల్లు, స్కూల్స్, కాలేజీలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. క్యూన్కా నగరంలో ఓ వ్యక్తి వాహనంలో ఉండగా.. ఒక్కసారిగా గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈక్వెడార్ సరిహద్దులోని టుంబెస్ ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోవడం వల్ల 4 ఏళ్ల బాలిక తలకు గాయమై చనిపోయిందని పెరు ప్రధాని అల్బెర్టో ఒటారోలా తెలిపారు. మనాబి, మాంటా, రాజధాని క్విటోతో సహా అనేక ప్రధాన నగరాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ భూకంపం నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని తెలిపారు.

strong earthquake in ecuador
ఈక్వెడార్​లో భూకంపం కారణంగా ఇళ్లలోకి చేరిన నీరు

అతి తక్కువ జనాభా ఉన్న ఈ ఈక్వెడార్​ ప్రాంతం ఎక్కువగా భూకంపాలకు గురవుతుంది. 2016లో ఈ దేశంలో వచ్చిన భూకంపం కారణంగా దాదాపు 600 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు.

పాక్​ వదరల్లో చిక్కుకుని 8 మంది మృతి
పాకిస్థాన్​లో వరదలు కారణంగా 8 మంది మృతి చెందారు. శనివారం ఉదయం బలూచిస్థాన్​ ప్రాంతంలో వరదలు కారణంగా ఓ వాహనం కొట్టుకుపోయింది. దీంతో అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. పై నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయడానికి ప్రయత్నించిన సరే ఫలితం లేకపోయిది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు వృద్ధులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న కారణంగా అవరాన్​ జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.