ETV Bharat / international

అమెరికా మాజీ అధ్యక్షుడికి బిగ్​ షాక్​- ప్రైమరీ బ్యాలెట్​ నుంచి డొనాల్డ్​ ట్రంప్​ ఔట్​!

author img

By PTI

Published : Dec 29, 2023, 12:00 PM IST

Updated : Dec 29, 2023, 12:41 PM IST

Donald Trump Disqualified : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్​నకు మరో షాక్​ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై మరో రాష్ట్రం వేటు వేసింది. ప్రైమరీ ఎన్నికల నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు మైన్‌ రాష్ట్ర ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

Donald Trump Disqualified
Donald Trump Disqualified

Donald Trump Disqualified : మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని భావిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్‌ నిలవకుండా ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించగా తాజాగా మరో రాష్ట్రం ఆయనపై వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తున్నట్లు మైన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. కొలరాడో కోర్టు తీర్పుపై రిపబ్లికన్‌ పార్టీ అమెరికా ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం జరగడం గమనార్హం.

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్‌ రాష్ట్రంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్‌ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్‌ ట్రంప్‌ పేరును ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులపై ట్రంప్‌ కోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బెల్లోస్‌ నిర్ణయాన్ని రిపబ్లికన్‌ పార్టీ, మైన్‌ రాష్ట్ర కోర్టుల్లో సవాల్‌ చేయనుంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్‌ ఓడిపోయినప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి 2021 జనవరి 6న రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్‌ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని తేల్చింది.

గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కొలరాడో రాష్ట్రంలో ఓడిపోయారు. ఆ రాష్ట్ర ఓట్లు ఈసారి ట్రంప్‌నకు అంతగా అక్కర్లేదు. అయినా ట్రంప్ గెలిచి తీరాల్సిన రాష్ట్రాల్లో కూడా కోర్టులు, ఎన్నికల అధికారులు ఆ తీర్పును పాటిస్తే, ఆయన పోటీకి పూర్తిగా దూరం కావాల్సి వస్తుంది. కొలరాడో తీర్పు నేపథ్యంలోనే ఇప్పుడు మైన్‌ రాష్ట్రంలో ఆయనపై వేటు పడింది. దీంతో ఈ 'అనర్హత' విషయంలో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ట్రంప్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అధ్యక్ష ఎన్నికల ఫలితాల కేసులో ట్రంప్​కు చుక్కెదురు- పిటిషన్​ను తిరస్కరించిన కోర్ట్

'ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే నేనూ చేయను!- కానీ ఆయన్ను మాత్రం గెలవనివ్వం'

Last Updated : Dec 29, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.