Covid Virus Elders: వృద్ధుల్లో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపుతుండటానికి జన్యుపరమైన అంశాలే కారణమని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా శరీరం రోగనిరోధక కణాలను ఎంత వేగంగా వృద్ధి చేసుకుంటుదన్నదానిపైనే.. కొవిడ్ సహా ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా మనం ఎంత సమర్థంగా ఎదుర్కొంటామన్నది ఆధారపడి ఉంటుంది. వయోభారం మీదపడేకొద్ది ఆ కణాలను త్వరతగితిన అభివృద్ధిని చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనంలో గుర్తించారు.
"కణ విభజన జరిగినప్పుడల్లా డీఎన్ఏ ముక్కలవుతుంది. దాని చివర ఉండే టెలోమియర్ ప్రతి విభజ నతో మరింత పొట్టిగా మారుతుంది. ఒకా నొక దశలో అది మరీ పొట్టిగా అయిపోయి. విభజన ఆగిపోతుంది. అన్ని కణాల్లో కాకుండా, మానవుల రోగనిరోధక కణాల్లోనే ఈ పరిమితి కనిపిస్తోంది" అని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జేమ్స్ అండర్సన్ తెలిపారు. ఇలాంటి పరిమితి ఉన్నప్పటికీ సగటు వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ 50 ఏళ్ల వరకూ బాగానే పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆన్లైన్లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..