ETV Bharat / international

'ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్‌ ఔట్‌'.. మస్క్‌ వార్నింగ్​ - Elon Musk on work from home

Elon Musk Ultimatum Employees: టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తన సంస్థ ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేశారు. ఇక నుంచి వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కుదరదని స్పష్టం చేశారు. తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని.. లేదంటే టెస్లాను వీడిపోవచ్చంటూ ఘాటుగా హెచ్చరించారు.

Elon Musk: ‘ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్‌ ఔట్‌’: ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ హెచ్చరిక

author img

By

Published : Jun 2, 2022, 5:47 AM IST

Updated : Jun 2, 2022, 6:28 AM IST

Elon Musk Ultimatum Employees: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తన సంస్థ ఉద్యోగులకు చివరి హెచ్చరిక జారీ చేశారు. ఇంటి నుంచి పనిచేయడం కుదరదని.. ఇక నుంచి కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే టెస్లాను వీడిపోవచ్చంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు సంబంధించి ఎలాన్‌ మస్క్‌ తన ఉద్యోగులకు పంపించిన మెయిల్‌ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది.

'ఇతర ప్రాంతం నుంచి పనిచేయడం ఇక నుంచి ఆమోదయోగ్యం కాదు. రిమోట్‌ వర్క్‌ చేయాలి అని ఎవరైనా అనుకుంటే వారంలో కనీసం 40 గంటలు కార్యాలయంలో ఉండాల్సిందే. లేదంటే టెస్లా నుంచి వెళ్లిపోవచ్చు. ఫ్యాక్టరీ కార్మికులకు చెప్పిన దానికంటే ఇది చాలా తక్కువ' అంటూ ఇటీవల టెస్లా సంస్థ ఉద్యోగులకు ఓ మెయిల్‌ వచ్చింది. ఆఫీస్‌ అంటే ప్రధాన కార్యాలయమేనని.. విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీలు కాదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ లీకై ఉండవచ్చని ట్విట్టర్‌లో ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు. ఆఫీస్‌కు వెళ్లి పనిచేయడం అనేది పాత పద్ధతి అంటూ కొందరు భావిస్తున్నారని.. దీనిపై మీరేమైనా స్పందిస్తారా? అంటూ ఎలాన్‌ మస్క్‌ను అడిగాడు. అయితే, ఈ-మెయిల్‌ ప్రామాణికమైనదా? లేదా? అనే విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ ప్రస్తావించకుండా.. అటువంటి వారు వేరేచోట్ల పనిచేస్తున్నట్లు అనుకోవాలంటూ జవాబిచ్చారు.

ఇదిలా ఉంటే, సంస్థ ఉద్యోగుల పట్ల ఎలాన్‌ మస్క్‌ కఠినంగానే వ్యవహరిస్తారని వార్తలున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ఆయనతో పనిచేసిన వారు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు షాంఘైలో లాక్‌డౌన్‌ కారణంగా అక్కడున్న టెస్లా కార్యాలయంలో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కార్మికుల చేత వారానికి ఆరు రోజులపాటు పని చేయించడం, నిత్యం 12 గంటలు పని చేయిస్తున్నారని తెలుస్తోంది. కొవిడ్‌ ఉద్ధృతి వేళ క్లోజ్‌డ్‌ లూప్‌ మానిఫాక్చరింగ్‌ సిస్టమ్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న టెస్లా సిబ్బంది.. అలసిపోయి ఫ్యాక్టరీ నేలపైనే పడుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌పై ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది.

ఇదీ చూడండి: చైనాను కుదిపేసిన భారీ భూకంపం.. నలుగురు మృతి

Last Updated : Jun 2, 2022, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.