Colorado wildfire: అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో భారీ ఎత్తున దావానలం వ్యాపిస్తోంది. మంటలకు అడవులు పూర్తిగా తగలబడిపోతున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కార్చిచ్చు ప్రారంభమైంది. సాయంత్రం నాటికే 123 ఎకరాల అడవి దహించుకుపోయింది.
ఈ నేపథ్యంలో వెంటనే అత్యవసర ఆపరేషన్స్ సెంటర్‌ను అధికారులు ప్రారంభించారు. 400 మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరికీ అత్యవసర సందేశాలను పంపించారు. మంటలకు గల కారణాలు తెలియలేదు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తం 19 వేల మందిని తరలించినట్లు తెలుస్తోంది. ఎనిమిది వేల ఇళ్లకు దావానలం ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు.
దక్షిణ-ఆగ్నేయ దిశగా మంటలు వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రముఖ ఎల్డొరాడో కేన్యన్ స్టేట్ పార్కును మూసేశారు. ట్రెక్కింగ్, మౌంటెయిన్ క్లైంబింగ్ వంటి కార్యక్రమాలను రద్దు చేశారు. స్థానిక ప్రజలను పోలీసులు.. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు.
గతేడాది సైతం ఈ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. వందకు పైగా ఇళ్లు అప్పుడు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: పుతిన్‌కు ఉద్వాసన తప్పదా? మరో గోర్బచెవ్ అవుతారా?