తుర్కియేలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు మంది మృతిచెందగా.. 110 మందికి పైగా గాయపడ్డారు. మైన్‌లో చిక్కుకున్న మిగతా క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు. గనుల్లో పేలుడుకు తోడ్పడే వాయువులు ఉన్నందున ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గనిలో 110 మంది కార్మికులు ఉండగా వారిలో చాలా మందికి ఇప్పటికే బయటకి తీసుకొచ్చామని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారి సులేమాన్ సోయ్లు తెలిపారు. మరో 49 మంది ప్రమాదకరమైన ప్రదేశంలో చిక్కుకుని ఉన్నారని.. వారిని వీలైనంత త్వరగా రక్షిస్తామని చెప్పారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: చైనాలో లాక్డౌన్ భయాలు.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు