ETV Bharat / international

కరోనా పుట్టింది అక్కడే.. మూడేళ్ల తర్వాత వెల్లడించిన చైనా

కరోనా వైరస్‌ పుట్టుకకు కారణం ఏంటి? ఎక్కడి నుంచి వ్యాపించింది? అనే దానిపై స్పష్టమైన సమాధానం ఇప్పటికీ దొరకడం లేదు. కొందరు చైనాలోని హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి వ్యాప్తి చెందిందని చెబుతుంటే వూహాన్‌ ల్యాబ్‌లో చైనా ఈ వైరస్‌ను తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు కరోనా ప్రారంభంలో సేకరించిన నమూనాలపై అధ్యయనం చేసి తాజాగా వెల్లడించిన వివరాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

covid 19
covid 19
author img

By

Published : Apr 8, 2023, 7:09 AM IST

దాదాపు మూడేళ్ల క్రితం ప్రారంభమైన కరోనా వైరస్​ ఇప్పటికీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూనే ఉంది. దీని బారిన పడి ప్రాణాలు కోల్పొయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే అప్పట్లో ఈ వ్యాధి ఎలా పుట్టిందన్న విషయం గురించి ఎటువంటి స్పష్టత ఉండేది కాదు. ఓ వైపు ఇది చైనాలోని హువాన్‌ చేపల మార్కట్‌ నుంచి వ్యాప్తి చెందిందని అంటుంటే.. మరోవైపు దీన్ని వూహాన్‌ ల్యాబ్‌లో చైనా ఈ వైరస్‌ను తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇక ఈ విషయంపై చైనా శాస్తవేత్తలు ఇటీవలే అధ్యయనం చేశారు. అందలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

కరోనా వైరస్‌ ప్రారంభమైన తొలినాళ్లలో హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి సేకరించిన నమూనాలను అధ్యయనం చేసి మూడేళ్ల తర్వాత వాటి వివరాలను తాజాగా చైనా వెల్లడించింది. నమూనాలను పరీక్షించినప్పుడు అందులో అడవి జంతువుల జన్యుపదార్థాలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీనిని బట్టి కరోనా వైరస్‌ ప్రథమంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న 2022 ఫిబ్రవరిలో చైనా శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. కానీ, హువాన్‌ మార్కెట్‌ నుంచి సేకరించిన నమూనాల జన్యు విశ్లేషణను అందులో పొందుపరచలేదు. తాజాగా ఆయా రంగాల్లో నిష్ణాతులతో సంప్రదింపులు జరిపి, వారి సమక్షంలో పరిశోధనలు చేసి అధ్యయనం వివరాలను ప్రచురించారు.

చైనా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం కేవలం హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి మాత్రమే కాకుండా దేశంలో జంతు మాంసాన్ని విక్రయిస్తున్న వివిధ ప్రాంతాల నుంచి స్వాబ్‌లను సేకరించారు. వాటిలోనూ కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. దీనిని బట్టి కరోనా వైరస్‌ వ్యాప్తికి జంతువులు ఒక కారణం కావొచ్చని నిర్ధరణకు వచ్చారు. రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో చైనా శాస్త్రవేత్తల బృందం ఏకీభవించింది. అయితే, వాటి నుంచే వైరస్‌ వ్యాప్తి చెందిందనడానికి స్పష్టమైన ఆనవాళ్లు లేవని తెలిపింది. మార్కెట్‌లోని స్టాల్స్‌, పరిసరాల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌ ఉన్నంత మాత్రాన జంతువుల ద్వారానే ఇది వ్యాప్తి చెందిందని కచ్చితంగా చెప్పలేం అని చైనా శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది.

ఇతరులు దీనిపై అధ్యయనం చేసేందుకు ఈ డేటా ఎంతగానో ఉపకరిస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డేవిడ్‌ రోబర్ట్‌సన్‌ తెలిపారు అయితే ఆ జంతువులు కూడా మనుషుల్లాగా వైరస్‌ బారిన పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొవిడ్‌ వ్యాప్తి హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచే ప్రారంభమైందని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ అక్కడి జంతువుల్లో ఈ వైరస్‌ కారక జన్యువులను గుర్తించడం ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తుందని రోబర్ట్‌సన్‌ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.